Home / సినిమా
విశ్వక్ సేన్ కొత్త చిత్రం దాస్ కా ధమ్కీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన బల్గేరియన్ స్టంట్ డైరెక్టర్లు టోడర్ లాజరోవ్ మరియు జుజీ ఈ స్టంట్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పూరీ జగన్నాధ్‌కు భారీ షాక్ నిచ్చింది. చిన్న విరామం తరువాత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం హైదరాబాద్‌లో కుషి షూటింగ్లో ఉన్నాడు.
ప్రస్తుతం కొనసాగుతున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొన్ని కీలక ప్రకటనలను విడుదల చేసింది. ఒక నెల విరామం తర్వాత, సెప్టెంబర్ 1 నుండి షూట్లు పూర్తిగా తిరిగి ప్రారంభమయ్యాయి. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు రోజువారీ చెల్లింపులు ఉండవు.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, మౌనీ రాయ్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు పార్ట్ లుగా విడుదల కానుంది.
కార్తికేయ2 ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను తాకింది. ఈ చిత్రం గ్రాస్ ఇప్పుడు రూ.101.50 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ దాదాపు 48 కోట్లు. ఈ చిత్రం తో హీరో నిఖిల్ 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ప్రవేశించాడు
శర్వానంద్, రీతువర్మ జంటగా శ్రీ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం ఒకే ఒక జీవితం. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకే ఒక జీవితం తల్లి-కొడుకుల బాండింగ్‌తో కూడిన ఒక సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా నిర్మాతలు పవర్ గ్లాన్స్ ని శుక్రవారం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ‘దిగొచ్చింది భల్లు భల్లున, పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో, తెలుగోడు’ అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు. పెద్ద అన్నయ్య 'మెగాస్టార్' చిరంజీవి ముద్దుల తమ్ముడు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన నటన, డ్యాన్స్ ముఖ్యంగా చెప్పు కోవాలిసిన పవర్ స్టార్ మేనరిజం ప్రేక్షుకులను బాగా ఆకట్టుకున్నాయి.
సోనాలి పోగాట్ హత్య జరిగి సుమారు పది రోజులు కావస్తోంది. విచారణలో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం సోనాలి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాత్రం ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్.
బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఇటీవల ప్రముఖ చాట్ షో 'కాఫీ విత్ కరణ్' యొక్క 9వ ఎపిసోడ్లో కనిపించాడు. దిశా పటానీతో తనకు ఎలాంటి సంబంధం ఉంది అనే దాని గురించి మాట్లాడాడు. వీరిద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారని పుకార్లు ఉన్నాయి.