Robin Hood OTT: ఓటీటీకి నితిన్ రాబిన్ హుడ్ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పుడ? ఎక్కడంటే

Nithin Robin Hood OTT Release and Streaming Update: నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కని లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయ్ అందుకోలేకపోయింది. దీంతో నితిన్ ఖాతాలో మరో ప్లాప్ చేరింది. ఈ మధ్య నితిన్ సినిమాలు వరుసగా బాక్సాఫీసువ ద్ద నిరాశ పరుస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని ఆశగా ఎదురుచూశాడు.
అఖరికి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్రేజ్‌ని తనకు ప్లస్ చేసుకోవాలనుకున్నాడు. అంతేకాదు భీష్మతో తనకు బ్లాక్‌బస్టర్ అందించిన వెంకీ కుడుమలను నమ్ముకుని రాబిన్ హుడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ హింట్ కాంబో ఆ సెంటిమెంట్‌ని రిపీట్ చేయలేకపోయింది. డేవిడ్ వార్నర్ కూడా నితిన్‌ను గట్టేక్కించలేకపోయాడు. రిలీజ్‌కు ముందు రాబిడ్ హుడ్ ప్రమోషన్స్‌ని గట్టిగా చేశారు. డిఫరెంట్ ఇంటర్య్వూలతో ఆడియన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
కానీ అవేవి వర్కౌట్ కాలేదు. తొలిరోజు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఆడియన్స్‌ని ఈ చిత్రం నిరాశ పరిచింది. ఇందులో కామెడీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరన కరువైంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే బిగ్‌స్క్రీన్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఈ సినిమాను ఓటీటీ చూడాలనుకున్న ఆడియన్స్‌కి ఎదురుచూపులే మిగిలాయి. మూవీ రిలీజై నెల రోజులు దాటిన ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన, అప్‌డేట్ లేదు. దీంతో రాబిన్ హుడ్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(Zee5) సొంతం చేసుకుంది. డిజిటల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్‌ని కూడా జీ సంస్థ తీసుకుంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం తరహాలో రాబిన్ హుడ్‌ని రిలీజ్ చేయాలని సదరు సంస్థ ప్లాన్ చేస్తుంది. ఒకే రోజు ఇటూ టీవీలో అటూ ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటుందట. ఇక త్వరలోనే మూవీ టెలివిజన్ ప్రసారం, స్ట్రీమింగ్ డేట్‌పై ప్రకటన ఇచ్చేందుకు జీ5 సిద్ధమవుతుంది. మరోవైపు ఈ రాబిన్ హుడ్ మే 4 లేదా 10న ఓటీటీ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. మరి ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- Naga Chaitanya New Look: రగ్గడ్ నుంచి స్టైలిష్‌గా.. నాగచైతన్య లేటెస్ట్ లుక్ చూశారా? ఏమున్నాడు కదా..