Last Updated:

God Father: గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా

కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'గాడ్ ఫాదర్'. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి అదిరిపోయే ప్రీమియర్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా దక్కింది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ మొదటి రోజు కలెక్షన్లు ఎంతో చూసేద్దాం.

God Father: గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా

God Father: కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే ‘గాడ్ ఫాదర్’. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి అదిరిపోయే ప్రీమియర్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ మొదటి రోజు కలెక్షన్లు ఎంతో చూసేద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 38 కోట్లకి పైగా గ్రాస్‌ వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
నైజాం: రూ. 3.25 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 1.25 కోట్లు

సీడెడ్: రూ.3.05 కోట్లు

నెల్లూరు: రూ.57 లక్షలు

గుంటూరు: రూ.1.75 కోట్లు

కృష్ణా జిల్లా: రూ.73 లక్షలు

తూర్పు గోదావ‌రి: రూ.1.60 కోట్లు

పశ్చిమ గోదావ‌రి: రూ.80 లక్షలు

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఏపీలో 6.70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ‘గాడ్ ఫాదర్’ సినిమాకు మొదటి రోజు 13 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం.

ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో విలక్షణ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు.

ఇదీ చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. 15 కేటగిరీల్లో పోటీ