Last Updated:

Bigg Boss season 6: రేవంత్ బొమ్మను పడేసిన గీతూ!

బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ ఆట తీరు మార్చుకొని హౌస్ మేట్స్ తో సమరానికి సిద్దం అవుతున్నట్లు కన్పిస్తుంది. బిగ్ బాస్ మొదటి వారం కంటే రెండో వారంలో తన ఆటను మార్చి కెప్టెన్సీ టాస్కులో కూడా గీతూ విరగదీసింది.

Bigg Boss season 6: రేవంత్  బొమ్మను పడేసిన గీతూ!

Big Boss season 6: బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ ఆట తీరు మార్చుకొని హౌస్ మేట్స్ తో సమరానికి సిద్దం అవుతున్నట్లు కన్పిస్తుంది. బిగ్ బాస్ మొదటి వారం కంటే రెండో వారంలో తన ఆటను మార్చి కెప్టెన్సీ టాస్కులో కూడా గీతూ విరగదీసింది. బిగ్ బాస్ ఇంట్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఏమి ఉండదు ? ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండచ్చు. విలువలని పట్టించుకుంటే కూర్చుంటే మనం ఏమి కూడా సాధించలేము. అవి అన్ని బయట వదిలేసి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాలి. అలాగే ఇక్కడ గీతూ కూడా అలాగే చేసింది. తనకు ఎలాంటి మోహమాటలు ఉండవు అన్ని మొహం మీదే చెప్పేస్తుంటుంది.

ఈ వారం టాస్క్లో భాగంగా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక్కో బొమ్మను బిగ్ బాస్ ఇస్తాడు. బొమ్మల రూపంలో ఉన్న బేబీలను, ఎవరిది వారే చూసుకోవాలని బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారందరికీ చెబుతాడు. ఛాలెంజింగ్‌లు పాల్గొని గెలిచిన వారు కెప్టెన్సీ కంటెస్టెంట్స్ అవుతారని చెప్పాడు. ఐతే ఈ బేబీలు ఒక వేళ లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో కనిపిస్తే వారు ఆట నుంచి తొలగుతారని ప్రకటిస్తాడు.

మొదటి బజర్ మొగిన వెంటనే రేవంత్,ఫైమా, చలాకీ చంటి, గీతూ, ఇలా అందరూ ముందు పెట్టేస్తారు. ఈ ఆటలో ఫైమా కొంచం దురుసుగా ప్రవర్తించి రేవంతును ఓడిస్తుంది. దీంతో రేవంత్ కు బాగా కోపం వస్తుంది. రేవంత్ బేబీని కీర్తి దగ్గరి నుంచి గీతూ తీసుకుని ఆమె లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పడేస్తుంది. బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం రేవంత్ ఆట నుంచి తపుకోవాలి. గీతూ కారణంగా రేవంత్ ఈ టాస్క్ నుంచి తప్పుకుంటాడు.

అందరూ హౌస్ మేట్స్ రాత్రి అంతా కూడా బేబీలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, వాటిని ఏ డ్రెస్లు కింద దాచకూడదని బిగ్ బాస్ ఇంటి సభ్యులను హెచ్చరించాడు. అభినయ మాత్రం గీతూ బొమ్మను తీసుకొని లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పడేయలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గీతూ తన బేబీని స్టోర్ రూంలో దాచి పెట్టినట్టు బిగ్ బాస్‌తో చెప్పుకుంది. రేపటి ఏపిసోడులో ఏం జరగబోతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి: