Last Updated:

NTR : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజినీకాంత్ – బాలకృష్ణ

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు కేవలం హీరో గానే కాకుండా తెలుగు ప్రజల్లో ఆరాధ్య దైవంగా కొలువై ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఒక వైపు సినిమాల్లోనూ నవరస నటనా సార్వభౌమ .. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.

NTR : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజినీకాంత్ – బాలకృష్ణ

NTR : విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు కేవలం హీరో గానే కాకుండా తెలుగు ప్రజల్లో ఆరాధ్య దైవంగా కొలువై ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఒక వైపు సినిమాల్లోనూ నవరస నటనా సార్వభౌమ .. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు ఎన్టీఆర్. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు ఎన్టీఆర్.

అలానే రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఏపీ సీఎంగా పని చేశారు. కాగా ఈ ఏడాది ఎన్టీఆర్‌ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి ఆయ‌న అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్య‌కర్త‌లు ప్లాన్ చేశారు.

మే 28న సీనియ‌ర్ ఎన్టీఆర్ జ‌యంతి. మే 23, 1923న జ‌న్మించిన ఆయ‌న శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. వ‌చ్చే నెల అంటే మే 28న విజ‌య‌వాడ‌లో ఈవెంట్‌ను బ్ర‌హ్మాండంగా నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ శ‌త జ‌యంతి వేడుక‌ల‌కు కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేస్తార‌ని కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.

అలానే బాలయ్య మాట్లాడుతూ.. ఈసారి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో నిర్వహించబోతున్నామని తెలియజేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించబోతున్న వేడుకలకు రజినీ కాంత్ ముఖ్య అతిధిగా రనున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్, రజినీకాంత్ కలిసి టైగర్ సినిమాలో నటించారు. అలానే వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, తెదేపా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.

ఎన్టీఆర్ బొమ్మతో రూ. 100 నాణెం (NTR)..

ఇటీవలే ఎన్టీఆర్ బొమ్మతో రూ. 100 నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ వంద రూపాయాల నాణెన్ని వెండితో తయారు చేయనున్నారు. ఈ మేరకు ఈ నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపించారు. ఈ నాణెంపై సలహలు, సూచనలు తెలియజేయాలని కోరారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ వెండి నాణెన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.