Published On:

Sudigali Sudheer: సుధీర్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ధనరాజ్ భార్య..

Sudigali Sudheer: సుధీర్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ధనరాజ్ భార్య..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై మెగాస్టార్ గా సుధీర్ ఎదుగుతున్నాడు. షోస్, సినిమాలతో బిజీగా ఉన్న సుధీర్.. జబర్దస్త్ నుంచి రష్మీతో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.  వీరిద్దరి జంట కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ మీద వీరి కెమిస్ట్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ జంట పెళ్లి చేసుకుంటారా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

 

ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ తప్ప ఆఫ్ స్క్రీన్ లో తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని సుధీర్, రష్మీ చెప్పుకొస్తూనే ఉన్నారు. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని.. ఈ ప్రేమ కేవలం ఆన్ స్క్రీన్ వరకే అని ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. కానీ, ఈ జంట ఫ్యాన్స్ మాత్రం వీరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశపడుతూనే ఉన్నారు.

 

ఇక సుధీర్ పెళ్లి ఎప్పుడు.. ? అనే ప్రశ్న ఎప్పటికప్పుడు బుల్లితెరపై వినిపిస్తూనే ఉంటుంది. కొన్నిరోజులు రష్మీతో పెళ్లి అని.. ఇంకొన్నీ రోజులు సుధీర్ ఒక బిజినెస్ మ్యాన్ కూతురిని వివాహమాడుతున్నాడని.. ఇంకొన్నిరోజులు ఒక ప్రొడ్యూసర్ కూతురుతో సుధీర్ పెళ్లి అని.. ఇలా రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

 

సుధీర్ మాత్రం తన పెళ్లి గురించి ఎక్కడా క్లారిటీ ఇచ్చింది లేదు. ఇంకోపక్క రష్మీ సైతం సుధీర్ తో పెళ్లిఅనేది  లేదని చెప్పుకొస్తుంది. తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి కమెడియన్ ధనరాజ్ భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ నుంచి సుధీర్ తనకు తెలుసు అని.. అతను చాలా మంచివాడని చెప్పుకొచ్చింది.

 

” మా ఆయనకు జబర్దస్త్ లో అందరు పరిచయమే. మా ఇంటికి కూడా అందరూ వస్తారు. కిచెన్ లో వంటలు చేస్తారు. అల్లరల్లరి చేస్తారు. రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను.. ఇలా అందరూ వస్తారు. కాకపోతే నాకు ఎక్కువ సుధీర్ పరిచయం. తను చాలా మంచి వ్యక్తి. నేనెంత ముక్కుసూటి మనిషినో.. అతను అంతే. ఏదైనా ముఖం మీద చెప్పేస్తాడు.

 

సుధీర్ పెళ్లి గురించి రెండు రోజులక్రితమే  అతని అమ్మానాన్నలతో మాట్లాడాను. సుధీర్ పెళ్లి చేసుకోడు. అతనికి ఈ కమిట్మెంట్ లు అవి ఇష్టం ఉండవు. ఒక దగ్గర స్ట్రక్ అవ్వడం ఇష్టం ఉండదు. దాదాపు పెళ్లి చేసుకోడు అని నేను అనుకుంటున్నాను. మరి భవిష్యత్తులో చేసుకుంటాడేమో చూడాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అదేంటి సుధీర్ పెళ్లి చేసుకోడా.. ? అని అభిమానులు షాక్  కు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి: