Published On:

KJQ Teaser: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తమ్ముడు హీరోగా ‘కేజేక్యూ’ – ఆకట్టుకుంటున్న మూవీ టీజర్‌

KJQ Teaser: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తమ్ముడు హీరోగా ‘కేజేక్యూ’ – ఆకట్టుకుంటున్న మూవీ టీజర్‌

KJQ Movie Teaser Release: దసరా ఫేం దీక్షిత్‌ శెట్టి, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల సోదరుడు శశి ఓదెల ప్రధాన పాత్రల్లో యుక్తి తరేజ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘కేజేక్యూ: కింగ్‌.. జాకీ.. క్వీన్'(KJQ Movie Teaser). కె.కె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌లో చేరుకూరి సుధాకర్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. యాక్షన్‌, థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.

 

తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ టీజర్‌ ఆసక్తిగా సాగింది. ఒకటిన్నర నిమిషం నిడివి గల టీజర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సాగింది. ‘ఈ సిటీ.. గన్‌.. రెండు ఒక్కటే.. ఎవడి చేతిలో ఉంటదో వాడి మాటే ఇంటది’ బ్యాగ్రౌండ్‌ వాయిస్‌తో ఈ టీజర్‌ సాగింది. పోయి చెప్పు.. ఈ ఊరికి ఒక మొగాడు వచ్చాడు.. అంటూ దిక్షిత్‌ శెట్టి చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. మొగాడు గెలుచుకుంటాడు.. కానీవాడు లాక్కుంటాడు.. నువ్వేంటి అని హీరోయిన్‌ డైలాగ్‌ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ టీజర్‌ మొత్తం గన్‌తో పేల్చుకోవడం, చంపుకోవడం వంటి యాక్షన్‌ సన్నివేశాలతో సాగింది.

 

‘ఇక చివరిలో రావణాసురుడు నా లెక్క ఆలోచింకపోతే రామాయణం ఉండేడిదే కాదు’ అనే డైలాంగ్‌ ఆకట్టుకుంది. మొత్తానికి ఈ టీజర్‌ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ మాత్రం ఓరేంజ్‌లో ఉండబోతుందని అర్థమైపోతుంది. ఆర్జీవీ చిత్రాల తరహా ‘కేజేక్యూ’ సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో ఆడియన్స్‌ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కాగా ఈ సినిమాతో దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల సోదరుడు శశి ఓదెల కథనాయకుడిగా పరిచయం కాబోతుండటం విశేషం.