Anchor Vishnupriya: బెట్టింగ్ యాప్ కేసు – విచారణలో సంచలన విషయాలు బయటపెట్టిన విష్ణుప్రియ

Vishnupriya Investigation Over in Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు రోజురోజుకు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బిగ్‌బాస్ భామ, యాంకర్ విష్ణు ప్రియ పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తన అడ్వకేట్‌తో కలిసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు వచ్చింది. కాసేపటికి క్రితమే ఆమె విచారణ పూర్తయ్యింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ విచారణలో విష్ణుప్రియ కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్
ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్టు అంగీకరించిన ఆమె వీటి ద్వారా భారీ మొత్తం వచ్చినట్టు చెప్పింది. తాను దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు తెలిపింది. అలా ఒక్కో యాప్‌కు దాదాపు రూ. 90వేలు వచ్చినట్టు వెల్లడించింది. ఈ విచారణలో పోలీసులు విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. అనంతరం ఆమె ముబైల్ ఫోన్ సీజ్ చేశారు. కాగా ఈ బెట్టింగ్ యాప్ వ్యవహరంలో రోజుకో కీలక పరిణామం తీసుకుంటుంది.
విజయ్ దేవరకొండ, రానాలపై కూడా
బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసిన వారిపై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. విష్ణుప్రియతో పాటు పలువురు బుల్లితెర నటీనటులుతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు హర్షసాయి, సన్నియాదవ్‌లు, యూట్యూబర్ టేస్టీ తేజ, రితూ చౌదరి, సుప్రీత ఇలా దాదాపు 11 మందిపై ఈ కేసు నమోదైంది. అయితే టాలీవుడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, యాంకర్ శ్యామలపై మియాపూర్ పోలీస్ స్టేషన్ గురువారం కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో సుమారు 25 మందిపై కేసు నమోదనట్టు తెలుస్తోంది.