Actress Abhinaya: ప్రియుడితో ఎంగేజ్ మెంట్ – కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన అభినయ

Actress Ahinaya Shared her Fiance Photo: నటి అభినయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో టాలీవుడ్ మంచి గుర్తింపు పొందింది. డమరుకం, శంభో శివ శంభో వంటి చిత్రాల్లో నటించిన ఆామెకు మంచి గుర్తింపు ఇచ్చింది మాత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు‘ మూవీనే. తెలుగులో ఎన్నో పెద్ద చిత్రాలు, స్టార్ హీరోలకు చెల్లెలు నటించిన ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సంగతి తెలిసిందే.
తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది ఆమె. గుడిలో గంట కొడుతు ఉన్న ఫోటో షేర్ చేసింది. అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా ఎప్పుడు జరిగిందో చెప్పింది. మార్చి 9న తమ నిశ్చితార్థం జరిగినట్టు తెలిపింది. ఆమె కాబోయే భర్త పేరు ‘సన్నీవర్మ’ అని తెలిపింది. ప్రముఖ కన్స్ స్ట్రక్షన్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నట్టు వెల్లడించింది.
కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తమ ప్రేమ గురించి మొదటి సారి బయటపెట్టింది. అప్పుడే హీరో విశాల్ తో ప్రేమ, పెళ్లంటూ వచ్చిన వార్తలను కూడా ఖండించింది. తమది ప్రేమ వివాహమని, తను చిన్ననాటి మిత్రుడని చెప్పింది. తమది 15 ఏళ్లుగా తాము రిలేషన్ లో ఉన్నామని చెప్పింది. తనకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా తనతో భయం లేకుండ పంచుకుంటానంది. త్వరలోనే అతడి పెళ్లి చేసుకోబోతున్నాను చెప్పిన సంగతి తెలిసిందే.