Last Updated:

Delhi prestigious Engineering institutes: జేఈఈ మెయిన్ స్కోర్ తో ఢిల్లీలోని ప్రతిష్మాతక ఇంజనీరింగ్ సంస్దల్లో ప్రవేశం.. ఎలాగో తెలుసా?

జేఈఈ మెయిన్ స్కోర్ తో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీటు రాని వారికి గుడ్ న్యూస్. ఈ స్కోరుతో ఢిల్లీలోని ప్రతిష్మాతక ఇంజనీరింగ్ సంస్దల్లో సీటు సంపాదించుకోవచ్చు. దేశంలో చాలా ఎన్ఐటీలు , ట్రిపుల్ ఐటీల కన్నా మంచి నాణ్యమైన సదుపాయాలు,విద్యను అందించే ఈ సంస్దల్లో నాన్ లోకల్ కోటా లో సీటు సంపాదించవచ్చని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.

Delhi prestigious Engineering institutes: జేఈఈ మెయిన్ స్కోర్ తో ఢిల్లీలోని ప్రతిష్మాతక ఇంజనీరింగ్ సంస్దల్లో ప్రవేశం.. ఎలాగో తెలుసా?

Delhi prestigious Engineering institutes: జేఈఈ మెయిన్ స్కోర్ తో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీటు రాని వారికి గుడ్ న్యూస్. ఈ స్కోరుతో ఢిల్లీలోని ప్రతిష్మాతక ఇంజనీరింగ్ సంస్దల్లో సీటు సంపాదించుకోవచ్చు. దేశంలో చాలా ఎన్ఐటీలు , ట్రిపుల్ ఐటీల కన్నా మంచి నాణ్యమైన సదుపాయాలు,విద్యను అందించే ఈ సంస్దల్లో నాన్ లోకల్ కోటా లో సీటు సంపాదించవచ్చని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.

జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ (జేఏసీ) ద్వారా..(Delhi prestigious Engineering institutes)

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ, నేతాజీ సుభాష్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ యూనివర్శిటీ, ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ .మొత్తం ఈ 5 కాలేజీల్లో 6,400 సీట్లు ఉంటాయి. జేఈఈ మెయిన్స్ స్కోరు ప్రకారం అడ్మిషన్లు ఉంటాయి. జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ (జేఏసీ) ద్వారా వీటిలో ప్రవేశాలను కల్పిస్తారు. వీటిలో ప్రవేశానికి జూన్ 25 లోగా రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకుంటే 28 నాటికి లిస్ట్ ప్రిపేరవుతుంది. జూలై 7 నాటికి రెండవ రౌండ్ ఉంటుంది. జూలై 12 నాటికి రౌండ్ 3 ఉంటుంది. పొరపాటున రౌండ్ 1 లో దరఖాస్తు చేసుకోనవారు మరలా జూలై 12, 13 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తరువాత జూలై 21 నాటికి నాల్గవ రౌండ్ ఉంటుంది. అప్పుడు కూడా మిగిలిన సీట్లను కాలేజీలకు పంపిస్తారు. అపుడు కాలేజీలు స్పాట్ రౌండ్ లో అడ్మిషన్లు కల్పిస్తాయి.

మంచి కోర్సులు.. క్యాంపస్ సెలక్షన్లు..

నేతాజీ సుభాష్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో మూడు క్యాంపస్ లు ఉన్నాయి. ఇంజనీరింగ్ లో 18 బ్రాంచులు ఉంటాయి. ఇక్కడ 2200 సీట్లు ఉన్నాయి. చాలా ఎన్ఐటీల కన్నా బెటర్ గా ఉంటుంది.ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో 14 బ్రాంచిలు ఉన్నాయి. ఇక్కడ 2500 సీట్లు ఉన్నాయి. ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్య ప్రెన్యూర్ షిప్ యూనివర్శిటీ లో 500 సీట్లు, రెండు క్యాంపస్ లు ఉన్నాయి.ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ లో 1000 కి పైగా సీట్లు ఉన్నాయి.ఇక్కడ ఈసీఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఉంది. ఈ కోర్సు మరెక్కడా లేదు. మొత్తం ఈ ఐదు విద్యాసంస్దల్లోనూ మంచి ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్నాయి. క్యాంపస్ సెలక్షన్లు బాగుంటాయి.అడ్మిషన్ల కోసం ప్రయారిటీ ఇచ్చేటపుడు జాగ్రత్తగా ఇవ్వవలసి ఉంటుంది.

విద్యార్దులు ఈ కోర్సులకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.