Published On:

BJP: ప్రధాని మోదీ నాయకత్వంలో అక్షరాస్యత పెరిగింది: కిషన్ రెడ్డి

BJP: ప్రధాని మోదీ నాయకత్వంలో అక్షరాస్యత పెరిగింది: కిషన్ రెడ్డి

PM Modi: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అక్షరాస్యతా శాతం పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ సుచిత్ర ఆధ్వర్యంలో పది, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతిని ఆయన అందజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు.

 

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ది బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అన్నీ కుంభకోణాలే అని విమర్శించారు. ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదని అన్నారు. పాకిస్తాన్‌ ISI కారణంగా అనేక ఇబ్బందులు పడ్డామని.. హైదరాబాద్‌ సహా అనేక పట్టణాల్లో ఉగ్రదాడులు జరిగాయని చెప్పారు. మోదీ పాలనలో పాక్‌ ఉగ్రదాడులకు గుణపాఠం చెబుతున్నామని.. భారత్‌ సత్తా ఏంటో పాక్‌తో సహా ప్రపంచ దేశాలకు చాటామని కిషన్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి: