Dreams : కలలో ఏ దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
కల.. నిద్రపోయాక ప్రతి ఒక్కరికి సాధారణంగా ఏదో కల వస్తూనే ఉంటుంది. కొంత మంది ఆ కలలు మెలకువ వచ్చిన తర్వాత మర్చిపోతారు. కొన్ని కలలు చాలా కాలం వరకు గుర్తుంటాయి. కొన్నిమర్చిపోలేనివి వస్తుంటాయి. మరికొందరు కలలలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని భావిస్తారు.

Dreams : కల.. నిద్రపోయాక ప్రతి ఒక్కరికి సాధారణంగా ఏదో కల వస్తూనే ఉంటుంది. కొంత మంది ఆ కలలు మెలకువ వచ్చిన తర్వాత మర్చిపోతారు. కొన్ని కలలు చాలా కాలం వరకు గుర్తుంటాయి. కొన్నిమర్చిపోలేనివి వస్తుంటాయి. మరికొందరు కలలలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని భావిస్తారు. కాగా కలల శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలు కన్నప్పుడు అవి మంచి, చెడులు సంకేతాలుగా తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది కలలను కేవలం కలలుగా భావిస్తారు. అయితే కలలో కనిపించే కొన్ని అంశాలు ఆర్ధిక ప్రయోజనాలను సూచిస్తాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని సార్లు మనకి కలలో దేవుడు కనిపిస్తాడు. మరి మన కలలో దేవుడు కనిపించడం మంచిదేనా.. అది దేనికి సంకేతమే తెలుసా.. ఏ దేవుడు కనిపిస్తే ఏ పరిణామాలు ఉంటాయో మీకోసం ప్రత్యేకంగా..
శివుడు కలలోకి వస్తే..
మీ కలలో శివుడి కనిపిస్తే. మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నారని అని అర్ధం. శివుడు కలలోకి వచ్చాడంటే అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, అది కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
రాముడిని కలలో చూస్తే..
మీరు కలలో రాముడిని చూస్తే చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయట. అయితే మీ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సంకేతం.
దుర్గమ్మ కోపంగా కనిపిస్తే..
మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయట.
లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..
మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే.సంపదకు చిహ్నం.కలలో లక్ష్మీమాతను చూస్తే. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.లాభాలను పొందుతారని అంటారు. కలలో శ్రీకృష్ణుని దర్శనం.
శ్రీకృష్ణుడు కనిపిస్తే..
స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా మంచిదట.
ఎటువంటి విషయాలు కలలలో కనిపిస్తే.. డబ్బు వస్తుందో తెలుసా?
ఎవరైనా తమ కలలో వివాహిత స్త్రీ నృత్యం చేయడాన్ని చూస్తే, మీకు ఎక్కడి నుండైనా డబ్బు వస్తుందని సంకేతం.
కలలో రాజభవనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తే, అటువంటి వారికీ త్వరలో డబ్బు వస్తుందని సూచన.
కదంబ చెట్టు కలలో కనిపిస్తే, అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. కలల శాస్త్రం ప్రకారం.. ఎవరి కలలో కదం చెట్టును చూస్తే వారు త్వరలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
ఏ వ్యక్తి కలలో ఆవు పాలు పితుకుతున్నట్లు కనిపిస్తే, అది శుభసూచకంగా.. ప్రయోజనాలను పొందే సంకేతంగా కూడా పరిగణించబడుతుంది.
కలలో తామర పువ్వు , జామ చెట్టు కనిపిస్తే.. ఈ కల కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల ఇంటికి వచ్చే ఆనందం , శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/