Last Updated:

Daily Horoscope : నేడు పలు రాశుల లోని వారికి ఒకటి, రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుసా..?

జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ఒకటి, రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 2 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు పలు రాశుల లోని వారికి ఒకటి, రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుసా..?

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ఒకటి, రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 2 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. స్నేహితుల ద్వారా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మీ స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృషభం..

ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  ఇప్పట్లో ఉద్యోగం మారటానికి అవకాశం లేదు. పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తూ ఉంటారు. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఐటీ రంగానికి చెందినవారు ఆర్థికంగా ముందుకు వెళతారు. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.

మిథునం..

కొందరు మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులు అండగా నిలబడతారు.

కర్కాటకం..

ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలవల్ల ప్రయోజనం ఉంటుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరే సమయం అనుకూలంగా ఉంది. చిన్నపాటి అనారోగ్యం నుంచి కోలుకుంటారు. పిల్లలు పురోగతి చెందుతారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది.

సింహం..

వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఒకదానికి పరిష్కారం కనిపిస్తుంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వైద్య విద్యార్థులు మాత్రం కొద్దిగా రాణిస్తారు. స్నేహితురాలి మీద బాగా ఖర్చవుతుంది. ఇతరులకు బాగా ప్రయోజనం కలిగించే పనులు చేస్తారు.

కన్య..

ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. అతి కష్టం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కొందరు బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. కుటుంబంలోని పెద్దలు చాలా వరకు అండగా నిలబడతారు. ఐటీ వంటి వృత్తి నిపుణులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. డాక్టర్లు, లాయర్లకు క్షణం తీరిక లేకుండా ఉంటుంది. శుభవార్తలు వింటారు.

తుల..

ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం పట్టవచ్చు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం (Daily Horoscope)..

వృశ్చికం..

ఆర్థిక పరిస్థితి నిలకడగా నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు చికాకు పెడతాయి. బంధువుల సహాయంతో ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించుకుంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి శ్రమ ఎక్కువవుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

ధనుస్సు..

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. శుభకార్యాల మీద ఖర్చు చేస్తారు. బంధు మిత్రులతో విహారయాత్రకు బయలుదేరుతారు. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు.

మకరం..

ఆదాయపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వివాహప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి వాతావరణం సామరస్యంగా ఉంటుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా వీలైనంతగా సహాయపడతారు. విద్యార్థులు కొద్ది శ్రమతో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం పర్వాలేదు.

కుంభం..

ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామికి స్వల్పంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది.  కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ప్రయాణాల్లో డబ్బు నష్టం జరుగుతుంది. కుటుంబ సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది.

మీనం..

ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఉపయోగ సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం పర్వాలేదు.