Last Updated:

CM Ys Jagan : ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి చిత్రపటాలకు సీఎం జగన్  పూలమాలలు వేసి నివాళులర్పించారు.

CM Ys Jagan : ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

CM Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి చిత్రపటాలకు సీఎం జగన్  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంధ్రులు  అనే పుస్తకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు.

అదే విధంగా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన తయాగాన్ని గురించి జగన్ (CM Ys Jagan) గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు 1ని అవతరణ దినోత్సవంగా నిర్వహించేవారు. కానీ 2014 జూన్ 2 న రాష్ట్రం విడిపోవడంతో కొంత గందరగోళ పరిస్ధితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరపాలో గత ప్రభుత్వ హయాంలో క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అదే రోజున వేడుకలు నిర్వహిస్తుంది.

 

 

గతంలో ఉమ్మడి మద్రాస్‌లో తెలుగు వారికి అన్యాయం జరుగుతుందనే భావనతో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ తెరపైకి వచ్చింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై చర్చ జరిగింది. అయితే రాయలసీమ, విశాఖకు చెందిన ప్రతినిధులు ఈ ప్రతిపాదనకు సుముఖత చూపలేదు. ఆ ప్రాంతాల్లో కూడా బోగరాజు పట్టాభి సీతారామయ్య పర్యటించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభలో పట్టాబి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్యతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై కరపత్రాలను పంపిణీ చేశారు.

రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేశారు. ఆ తర్వాత ఉద్యమం అలా కొనసాగింది. 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు నిరహార దీక్షను ప్రారంభించారు. 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు కన్నుమూయడంతో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రధాని నెహ్రూ ప్రకటించారు.  1953 అక్టోబరు 1 న విడగొట్టబడి, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది.  ఈ 11 జిల్లాలు ఆనాడు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. ఆ సమయంలో భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ కూడా ఉంది. దీంతో 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుంచి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.