Last Updated:

Ycp Activist : పార్టీలో గుర్తింపు దక్కడం లేదని.. ఎస్సీ లంటే చిన్న చూపు అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైసీపీ నేత

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆంజనేయులు 2011 నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. అయితే పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ తనకు గుర్తింపు దక్కడం లేదని.. ఏదైనా సాయం కోరితే వారిని కలవండి, వీరిని కలవండి అని చెబుతున్నారని.. పార్టీలో ఎస్సీలంటే ఎందుకు అంత చిన్న

Ycp Activist : పార్టీలో గుర్తింపు దక్కడం లేదని.. ఎస్సీ లంటే చిన్న చూపు అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైసీపీ నేత

Ycp Activist : పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆంజనేయులు 2011 నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. అయితే పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ తనకు గుర్తింపు దక్కడం లేదని.. ఏదైనా సాయం కోరితే వారిని కలవండి, వీరిని కలవండి అని చెబుతున్నారని.. పార్టీలో ఎస్సీలంటే ఎందుకు అంత చిన్న చూపు అని ఆంజనేయులు అసహనం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అంతటితో ఆగకుండా తాను వైఎస్ జగన్ వీరాభిమానిని అంటూ స్థానికంగా బ్యానర్ కట్టుకుని.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ముందు టెంట్ వేసుకుని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు.

ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో వుండగా పార్టీకి సేవ చేసానని… 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించడంతో తన శక్తిమేరకు పనిచేసినట్లు తెలిపాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు ఎలాంటి గుర్తింపు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అందువల్లే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఆంజనేయులు వాపోయారు.

తన కష్టాన్ని గుర్తించి వైసిపిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని స్థానిక వైసిపి నాయకులు హామీ ఇస్తేనే తన నిరాహార దీక్షను విరమిస్తానని ఆంజనేయులు తెలిపారు. ఎన్ని రోజులయినా వైఎస్సార్ విగ్రహం ముందే తన నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆంజనేయులు స్పష్టం చేసారు. మరి ఈ ఘటనపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.