Khammam Crime: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి… ఎక్కించుకున్న వ్యక్తినే చంపేశాడు
ఈ మధ్యకాలంలో సాయం చెయ్యడం కూడా తప్పు అయిపోయింది. ఏదో పాపాం కదా అని సహాయం చెయ్యాలని చూసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Khammam Crime: ఈ మధ్యకాలంలో సాయం చెయ్యడం కూడా తప్పు అయిపోయింది. ఏదో పాపాం కదా అని సహాయం చెయ్యాలని చూసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట మండలం గండ్రాయికి బైక్‌పై బయలుదేరాడు. ముదిగొండ మండలంలోని వల్లభి సమీపంలో తమ బైక్ లో పెట్రోల్ అయిపోయిందని ఒకరికి లిఫ్ట్ ఇస్తే తెచ్చుకుంటామని ఇద్దరు వ్యక్తులు అడుగగా సరేనని ఒకరికి లిఫ్ట్ ఇచ్చాడు.
అలా ఎక్కించుకోవడమే తన ప్రాణాలమీదికి తెచ్చింది. కొంతదూరం వెళ్లాక బైక్ ఎక్కిన వ్యక్తి జమాల్ వీపుపై ఇంజక్షన్‌తో పొడిచాడు.
ఏదో గుచ్చుకున్నట్టు అనిపించడంతో జమాల్ నెమ్మదిగా వెళ్తూ ఏం చేశావని అతడిని అడిగాడు. దానితో అతడు బైక్ దూకి అక్కడ నుంచి పరారయ్యాడు. అంతే ఇంక ఇంజక్షన్ ప్రభావం పనిచేసి కళ్లు బైర్లు కమ్ముతుండడంతో కొంత దూరం ముందుకు వెళ్లి రోడ్డుపక్కన ఉన్న వారిని జమాల్ నీళ్లు అడిగాడు. అక్కడే ఉన్న వారికి ఫోన్ ఇచ్చి తన భార్యకు ఫోన్ కలపాలని అడిగాడు. తను ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో జరిగిన విషయాన్ని అక్కడ ఉన్నవాళ్లకు చెప్పాడు. దానితో వెంటనే అప్రమత్తమైన స్థానికులు జమాల్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ పడివున్న సిరంజిని స్వాధీనం చేసుకున్నారు.
లిఫ్ట్ అడిగి.. ఇచ్చిన వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇది పథకం ప్రకారం
జరిగిన హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, దీని వెనకున్న కారణాలు ఏంటనేవి ఇంకా తెలియరాలేదు. వ్యక్తిని చంపడానికి పిచ్చికుక్కలను చంపేందుకు వాడే రసాయనాన్ని ఇంజక్షన్‌లో ఎక్కించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: Crime News: అయ్యో చిట్టి తల్లి… కూల్ డ్రింక్ అనుకుని పురుగుల ముందు తాగి..!