SBI: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ
ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఈ నెల 15 నుంచి పెంచింది. వివిధ కాల పరిమితులపై 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు రూ.2 కోట్లు అంత కంటే తక్కువ మొత్తానికి వడ్డీరేట్లను పెంచింది.
SBI: ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ఈ నెల 15 నుంచి పెంచింది. వివిధ కాల పరిమితులపై 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు రూ.2 కోట్లు అంత కంటే తక్కువ మొత్తానికి వడ్డీరేట్లను పెంచింది. ఇక ఎఫ్‌డీ మేచురిటి 46 రోజుల నుంచి 179 రోజుల వరకు .. 180 రోజుల నుంచి 210 రోజుల వరకు అలాగే 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలానికి ఎఫ్‌డీ వడ్డీరేట్లు పెంచినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
179 రోజుల కాలానికి..(SBI)
సవరించిన వడ్డీరేట్ల ప్రకారం 46 నుంచి 179 రోజుల కాలానికి 75 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈ కాలానికి ఎఫ్‌డీ చేస్తే 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల కాలానికి 25 బేసిస్ పాయింట్లు పెంచి 6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల కాలానికి 25 బేసిస్ పాయింట్లు ఆఫర్ చేసింది. దీంతో వడ్డీరేటు 6.25 శాతం గిట్టుబాటు అవుతుంది. అయితే అకస్మాత్తుగా బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లు పెంచడానికి గల కారణం… గత నెలలో ముగిసిన రిజర్వుబ్యాంకు ద్వైపాక్షిక ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రెపోరేటును యధాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించారు.
అయితే అంతకు ముందు ఆర్‌బీఐ వరుసగా ఆరు సార్లు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లను ఏప్రిల్ 2023 నుంచి పెంచుకుంటూ వచ్చింది. కాగా ఆర్‌బీఐ గవర్నర్ అక్టోబర్ 2023 ద్రవ్యపరపతి సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 250 బేసిస్ పాయింట్ల కీలక వడ్డీరేట్లు పెంచినా.. బ్యాంకుల్లో డిపాజిట్లు మాత్రం పెరగలేదని వ్యాఖ్యానించారు. అయితే ఆర్‌బీఐ గత ఏడాది కాలం నుంచి రెపో రేటు పెంచుకుంటూ పోతుంటే అదే సమయంలో బ్యాంకులు కూడా ఎఫ్‌డీ రేట్లు ఇప్పటి వరకు మూడు సార్లు పెంచింది. అయితే ప్రారంభంలో బ్యాంకులు వడ్డీరేట్లు పెంచకున్నా.. ఇటీవల కాలంలో రెపో రేటు పెంచినప్పుడల్లా ఎఫ్‌డీ రేటును పెంచుకుంటూ పోతున్నాయి. ఎప్పడైతే రెపో రేటు తగ్గించితే అప్పుడు ఎఫ్‌డీరేట్లను తగ్గిస్తున్నాయి బ్యాంకులు.