Last Updated:

Phonepe: ఫోన్ పే సరికొత్త మైలురాయి

ప్రస్తుతం ఫోన్ పే తెలియని వారుండరు. యూపీఐ ట్రాన్సాక్షన్‌ ఫోన్‌పే సుపరిచితమే. ఎక్కువ మంది వినియోగించే యూపీఐ యాప్స్‌లో ఫోన్ పే ఒకటి. ఇప్పుడీ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం సరికొత్త మైలురాయిని చేరుకుంది.

Phonepe: ఫోన్ పే సరికొత్త మైలురాయి

Phonepe: ప్రస్తుతం ఫోన్ పే తెలియని వారుండరు. యూపీఐ ట్రాన్సాక్షన్‌ ఫోన్‌పే సుపరిచితమే. ఎక్కువ మంది వినియోగించే యూపీఐ యాప్స్‌లో ఫోన్ పే ఒకటి. ఇప్పుడీ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం సరికొత్త మైలురాయిని చేరుకుంది.

ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జరిగే వార్షిక పేమెంట్ల విలువ 1 ట్రిలియన్‌ డాలర్లకు (రూ. 84 లక్షల కోట్లు) చేరుకున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. యూపీఐ లావాదేవీల కారణంగానే ఈ స్పెషల్ ఫీట్ ను అందుకోగలిగినట్లు ఫోన్ పే పేర్కొంది.

 

50 శాతానికి పైగా మార్కెట్‌ వాటా(Phonepe)

2, 3, 4 టైర్‌ నగరాలతో పాటు, దేశంలోని 99 శాతం పిన్‌కోడ్లలో మూడున్నర కోట్ల మంది ఆఫ్‌లైన్‌ మర్చంట్స్‌ ద్వారా తాము సేవలందిస్తున్నామని కంపెనీ తెలిపింది.

యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో 50 శాతానికి పైగా మార్కెట్‌ వాటా కలిగి ఉన్నామని తెలిపింది.

తదుపరి దశలో యూపీఐ లైట్‌, యూపీఐ ఇంటర్నేషనల్‌, క్రెడిట్‌ ఆన్‌ యూపీఐ వంటి సేవల ద్వారా మరింత వేగంగా రాణించేందుకు కృషి చేస్తామని

ఫోన్‌పే కన్జ్యూమర్‌ బిజినెస్‌ హెడ్‌ సోనికా చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్‌బీఐ నుంచి పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ సైతం పొందినట్లు పేర్కొన్నారు.

 

విదేశాల్లోనూ యూపీఐ సేవలు

విదేశాల్లోని భారతీయులు ఇకపై యూపీఐ ద్వారా స్థానికంగా నగదు చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే యూఏఈ, సింగపూర్‌, మారిషస్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీంతో అంతర్జాతీయంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ఫిన్‌టెక్‌ సంస్థగా ఫోన్‌పే అవతరించింది. ఇకపై భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేయాల్సిన అవసరం లేకుండా తమ భారతీయ బ్యాంకు ఖాతా ద్వారానే నగదు చెల్లింపులు చేయొచ్చు.