Last Updated:

Transgender tea stall: అస్సాం లోని గౌహతి రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్ జెండర్ టీ స్టాల్‌

అస్సాం ప్రభుత్వం రైల్వే స్టేషన్‌లో మొట్టమొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులచే పూర్తిగా నిర్వహించబడుతున్న టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ టీ స్టాల్‌ను శుక్రవారం గౌహతి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ వద్ద నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NEFR) జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా ప్రారంభించారు.

Transgender tea stall: అస్సాం లోని గౌహతి రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్ జెండర్ టీ స్టాల్‌

Transgender tea stall: అస్సాం ప్రభుత్వం రైల్వే స్టేషన్‌లో మొట్టమొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులచే పూర్తిగా నిర్వహించబడుతున్న టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ టీ స్టాల్‌ను శుక్రవారం గౌహతి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ వద్ద నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NEFR) జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా ప్రారంభించారు.

ఇతర రైల్వే స్టేషన్లలో ఇలాంటి  టీ స్టాల్స్‌..(Transgender tea stall)

ఈ స్టాల్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NEFR) మరియు ఆల్ అస్సాం ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ మధ్య సహకారంతో ప్రారంభమయింది. ఈ సందర్బంగా NEFR ప్రతినిధి సబ్యసాచి దే మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ఇతర రైల్వే స్టేషన్లలో ఇలాంటి మరిన్ని టీ స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ యోచిస్తోందని అన్నారు. NEFR జనరల్ మేనేజర్ గుప్తా మాట్లాడుతూ దేశంలోనే మొదటిరిగా  అస్సాం ప్రభుత్వం  చొరవ తీసుకుందని తెలిపారు. అసోం ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్ అసోసియేట్ వైస్ చైర్మన్ స్వాతి బిధాన్ బారుహ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మరింత మంది లింగమార్పిడి వ్యక్తులకు పునరావాసం పొందే అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రాన్స్‌జెండర్ల కోసం సమగ్ర పధకం..

అసోంలో ట్రాన్స్‌జెండర్లు నిర్వహించే టీ స్టాల్‌ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, రాష్ట్ర ప్రభుత్వం గౌహతిలోని అమిన్‌గావ్‌లోని కమ్రూప్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఇదే విధమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కమ్యూనిటీ చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించి, వారికి సాధికారత కల్పించడమే లక్ష్యం. సుప్రీంకోర్టు ఏప్రిల్ 15, 2015న చారిత్రాత్మక తీర్పులో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని థర్డ్ జెండర్‌గా గుర్తించింది.ట్రాన్స్‌జెండర్ల పునరావాసం మరియు సంక్షేమం కోసం ఉప-పథకాన్ని కలిగి ఉన్న “సపోర్టు ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్” అనే సమగ్ర పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అస్సాం ప్రభుత్వం యొక్క తాజా చొరవ లింగమార్పిడి కమ్యూనిటీని కలుపుకొని పోవడానికి మరియు సాధికారత దిశగా సానుకూల అడుగుగా పరిగణించవచ్చు.