Gold Hallmarking: మార్చి 31 తర్వాత ఆ నగలపై నిషేదం
ప్రతీ ఒక్కరూ కల్తీ లేని బంగారంతో తయారు చేసిన నగలు కొనాలని అనుకుంటారు. కానీ తాము కొన్న నగల్లో బంగారం కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు.

Gold Hallmarking: ప్రతీ ఒక్కరూ కల్తీ లేని బంగారంతో తయారు చేసిన నగలు కొనాలని అనుకుంటారు. కానీ తాము కొన్న నగల్లో బంగారం కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మాల్‌మార్కింగ్ నిబంధనల్ని కఠినతరం చేసింది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది.
తాజాగా, ఇపుడు వినియోగదారుల మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 31 నుంచి హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ లేని నగలు విక్రయించకూడదు. ఒకవేళ అలా చేస్తే కఠన చర్యలు తీసుకోనున్నారు.
నగలకు స్పెషల్ హెచ్‌యూఐడీ కోడ్(Gold Hallmarking)
హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది నంబర్లు, అక్షరాలతో కూడిన 6 అంకెల కోడ్. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి బంగారు నగలకు ఓ స్పెషల్ హెచ్‌యూఐడీ కోడ్ ఇస్తారు.
ఆ కోడ్ ను లేజర్‌తో నగలపై మార్కింగ్ చేస్తారు. ఆ తర్వాత సదరు నంబర్ ను బీఐఎస్ డేటాలో భద్రపరుస్తారు. 2021, జులై 1 న తొలిసారి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.
వినియోగదారుల నమ్మకాన్ని పెంచుతుంది
హెచ్‌యూఐడీ ఆధారిత హాల్‌మార్కింగ్ వల్ల పారదర్శకత లభిస్తుంది. అది వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది.
హాల్ మార్కింగ్ అనేది వినియోగదారుల హక్కులను కాపాడుతుంది.
ఎవరైనా సరే ఇప్పటికే ఉన్న ఆభరణాలను హాల్‌మార్క్ చేయించుకుని దాని నిజమైన విలువను పొందేందకు వీలు ఉంది.
స్పలంగా పెరిగి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు శుక్రవారం (మార్చి 3, 2023) స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం 150 రూపాయలు పెరిగింది.
పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం నాడు 51,600 రూపాయలు ఉండగా, శుక్రవారం ఈ ధర రూ.51,750కి చేరింది.
24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రోజు 56,290 రూపాయలు ఉండగా, శుక్రవారం నాడు 56,450 రూపాయలకు పెరిగింది.
24 గ్రాముల బంగారం 10 గ్రాములపై 160 రూపాయలు పెరగడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
- AP Global Summit 2023: విశాఖ నుంచే పాలన చేయబోతున్నా.. మరోసారి స్పష్టం చేసిన వైఎస్ జగన్
- Credit card fraud: దిల్లీలో భారీ మోసం.. ధోనీ, అభిషేక్ పేరుతో క్రెడిట్ కార్డులు!