Last Updated:

Gautam Adani: $50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ

బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తాజా అప్ డేట్ ప్రకారం అదానీ మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లుగా ఉంది.

Gautam Adani: $50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ

 Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తాజా అప్ డేట్ ప్రకారం అదానీ మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లుగా ఉంది.

కేవలం ఒక నెల క్రితం అదానీ యొక్క నికర విలువ సుమారు $120 బిలియన్ల వద్ద ఉంది. అతను ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నాడు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్‌పై రిపోర్టును అందించిన తర్వాత అది ఒక్కసారిగా మారిపోయింది. భారతీయ స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ యొక్క లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్‌ పడిపోయింది.. ఏడు ప్రధాన అదానీ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా $120 బిలియన్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చగా, నివేదిక పెట్టుబడిదారులు మరియు ఆర్థిక సంస్థలలో ఆందోళనలను లేవనెత్తింది, ఫలితంగా దాని లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు నిరంతరం పతనమయ్యాయి.

ఆసియాలో  అత్యంత సంపన్నవ్యక్తి స్దానాన్ని కోల్పోయిన అదానీ.. ( Gautam Adani)

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో జాబితా చేయబడిన 500 మంది ధనవంతులలో అదానీ యొక్క సంపద క్షీణించింది.అతని నికర విలువ వేగంగా పడిపోవడంతో, అదానీ $83.6 బిలియన్ల నికర విలువతో ఇండెక్స్‌లో 11వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీకి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని కూడా కోల్పోయాడు. గౌతమ్ అదానీ, అంబానీతో ఉన్న గ్యాప్‌ని మూసేయడానికి మరియు లిస్టెడ్ కంపెనీ స్టాక్‌ల విలువలో తీవ్ర క్షీణత కారణంగా ఆ స్థానాన్ని తిరిగి పొందేందుకు మరి కొంత సమయం పట్టవచ్చు.

సీల్డ్‌ కవర్లో సూచించే నిపుణుల పేర్లను ఆమోదించమన్న సుప్రీంకోర్టు..( Gautam Adani)

అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక వివాదాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. తామే స్వయంగా నిపుణులను ఎంపిక చేస్తామని, యావత్తు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ధర్మాసనం వెల్లడించింది.నిపుణుల పేర్లను తాము ప్రభుత్వం నుంచి స్వీకరిస్తే, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. కమిటీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని పేర్కొంది. హిండెన్‌బర్గ్-అదానీ వివాదంపై దర్యాప్తు జరిపేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని నియమించబోమని స్పష్టం చేసింది. అయితే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించింది.సుప్రీంకోర్టు ఈ నెల 10న నిర్వహించిన విచారణ సందర్భంగా, అదానీ గ్రూప్ స్టాక్ పతనం నేపథ్యంలో మార్కెట్ ఒడుదొడుకుల నుంచి భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడవలసిన అవసరం ఉందని తెలిపింది. దేశంలోని నియంత్రణ వ్యవస్థలను పటిష్టపరచడానికి తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేసేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ డొమైన్ ఎక్స్‌పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేయడంపై పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

నిపుణుల కమిటీని ఏర్నాటు చేయాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు..

అదానీ గ్రూప్ స్టాక్ మేనిపులేషన్‌, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మంది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తానే స్వయంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.అయితే కేంద్ర ప్రభుత్వం అంతకుముందు వినిపించిన వాదనలలో, మన దేశంలోని మార్కెట్‌ నియంత్రణా సంస్థ — సెబీ వంటి చట్టబద్ధ వ్యవస్థలకు సంపూర్ణ సమర్థత ఉందని, ఇవి తమ పని తాము చేస్తున్నాయని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలోని నియంత్రణ వ్యవస్థలకు ఓ పర్యవేక్షక కమిటీ ఉండాలనే ఉద్దేశపూర్వకం కానటువంటి సందేశం పెట్టుబడిదారులకు వెళ్లడం వల్ల విదేశీ నిధుల రాకపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీకి సంబంధించిన అన్ని వివరాలను, అంటే, నిపుణుల పేర్లు, కమిటీ పరిధి వంటి వివరాలన్నిటినీ సీల్డ్ కవర్లో అందజేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.