Numbness In Hands: నిద్రలో చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా.. ఇలా చేస్తే ఇక రాదు..!

Numbness In Hands: నిద్రలో లేచిన వెంటనే చేతులు తిముర్లు పడుతున్నాయా.. మీరు సరైన పొజీషన్ లో పడుకోకపోవడమే అందుకు కారణం. ఈఆ సమస్య తరచుగా వస్తే మూడు వ్యాయామాలతో సరిచేసుకోవచ్చు. పడుకునే పొజీషన్ ను కొందరు అస్సలు పట్టించుకోరు. ఎలా పడుకుంటే అలా పడుకుంటారు అలాంటప్పుడు శరీరంపై ప్రభావం పడుతుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో తిమిర్లు వస్తాయి.
కొందరు తలకింద చేయి పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వలన నరాలపై ఒత్తిడి పడుతుంది. వీటిని తగ్గించుకోవడానికి మూడు రకాల వ్యాయామాలను చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చేతులకు తిమిర్లు వచ్చినప్పుడు స్పర్ష ఉండదు. చేతులు శరీరంలో లేనట్లు దూదిలా తేలికగా అనిపిస్తాయి. గట్టిగా గిచ్చినా నొప్పి ఉండదు. ఏదో ఒక సారి ఇలా జరిగితే పర్వాలేదు. కానీ తరచూ జరుగుతుంటే మాత్రం కచ్చితంగా జాగ్రత్తపడాలి.
తెరుస్తూ ముడుచుతూ
చేతులకు బాగా తిమ్మిర్లు ఎక్కనప్పుడు అరచేయిని తెరుస్తూ మూస్తూ ఉండాలి. ఇలా కంటిన్యూగా చేస్తే అరచేతిలోకి రక్త ప్రసరణ జరుగుతుంది. ఇలా కనీసం 30 సెకన్లు చేస్తే త్వరగా తగ్గిపోతుంది.
మణి కట్టు గుండ్రంగా తిప్పాలి
చేతులు తిమ్మిర్లతో మొద్దుబారినప్పుడు రిస్ట్ రొటేషన్ చేయాలి. కొన్ని సార్లు చేయిమొత్తం తిమ్మిర్లు పడుతుంది. ఏం చేసినా నార్మల్ కావడానికి సమయం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మణికట్టును గుండ్రంగా తిప్పాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఇలా కనీసం 1నిమిషం చేస్తూ గ్యాప్ ఇచ్చి రెండు మూడు సార్లు చేయాలి.
చేతి వేళ్లతో మణికట్టుకు వంచడం
మణికట్టుకు మరో దివ్యమైన వ్యాయామం ఉంది. అది చేతి వేళ్లను అన్నింటిని కలిపి మెల్లిగా వెనక్కి వంచాలి. అలా చేసినప్పుడు నరాలు బాగా సాగుతాయి. దీనివలన నరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. మణికట్టుపై బరువు పడేలా చేతి వేళ్లను వెనక్కి వంచాలి.
దీంతోపాటు చేతులు తలకింద పెట్టుకుని నిద్రపోవడం మానుకోవాలి. నిద్రపోయే ముందు చేతులకు మసాజ్ చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా వెన్నుముక బెడ్ కు అనుకుని నిద్రపోవడం ఉత్తమమైన పద్దతి.
గమనిక.. పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పాలించే ముందు డాక్టర్ల, నిపుణుల సలహా తీసుకోవాలి. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.