Home / బ్రేకింగ్ న్యూస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ 2 పాటల కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాటేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలోని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానితో వాహనం దిగి ఆయన మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. "వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితో ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం" అని పవన్ హెచ్చరించారు.
బుల్లితెర నాట కార్తీకదీపం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ రంగంలో ప్రస్తుతం ఈ ధారావాహిక రారాజుగా కొనసాగుతుంది. గత 5 ఏళ్ల నుంచి టాప్ రేటెడ్ సీరియల్ గా కొనసాగుతుంది. టీఆర్పీలో ఈ సీరియల్ అసమాన రికార్డ్స్ నమోదు చేసింది. తాజాగా 1500వ ఎపిసోడ్ పూర్తి చేసుకుని అన్ స్టాపబుల్ గా కొనసాగుతుంది.
డిసెంబర్ 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ విజయ్ దేవ్ ప్రకటించారు, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
నందిగామ పర్యటనలో ఉన్న తెదేపా జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయిపై గుర్తు తెలియని వ్యక్తి రాయిని విసిరాడు.
పంజాబ్లోని అమృత్సర్లో శివసేన నాయకుడు సుధీర్ సూరిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలు తగలడంతో సూరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ తుది శ్వాస విడిచాడు.
తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడంలేదంటూ రేపటిదినం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10గంటలకు 500మంది ధర్నాలో పాల్గొనున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియమించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనింది. రేపటినుండి ప్రైమరీ సూళ్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితంచేసేలా, ఎంతో ఆసక్తి కల్గించిన మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 92శాతం పోలింగ్ నమోదైంది.