Home / బ్రేకింగ్ న్యూస్
అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రటక జారీ చేసింది.
సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 15వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక కృష్ణ మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే తాజాగా తండ్రిని లేని లోటును జీర్ణించుకోలేక మహేష్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. పసికందులు నదిలో శవాలై కనిపించారు. వాన్ నదిలో గుట్టులుగుట్టలుగా శిశుల మృతదేహాలు కనిపించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను చేపట్టాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ కూడా భారత్ లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొంత మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైయ్యింది. ఏపీలో ఉనికి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ని నియమించింది అధిష్టానం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిడుగు రుద్రరాజుకు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 400 మందికి పైగా ఐటీ అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అయితే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
దక్షిణ భారత ప్రఖ్యాత నటుడు ఉలగనాయగన్ కమల్ హాసన్ నవంబర్ 23న శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ (SRMC)లో చేరారు. నివేదికల ప్రకారం, అతను సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరాడు. అతనికి జ్వరం రావడంతో పాటు చికిత్స అందించినట్లు సమాచారం. మరో రెండు రోజులు ఆయనకు పూర్తి విశ్రాంతిని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ రోజు తర్వాత నటుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
మంగళవారం నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. బేగంపేట పరిధిలోని రసూల్‌పురా-రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది.