Home / బ్రేకింగ్ న్యూస్
జార్ఖండ్ అక్రమ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో దాడులు చేసింది. రాంచీ, బీహార్, తమిళనాడు మరియు జాతీయ రాజధాని ప్రాంతంలోని అశోక్ నగర్ మరియు హర్ము ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి.
తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన రెండు వారాల తర్వాత బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ.. తన హయాంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ, తాను పక్షపాతం చూపనని అన్నారు.
బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ గారు గేమ్‌షో కౌన్ బనేగా కరోడ్‌పతి షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డట్లు తెలిసిన సమాచారం.
బీహార్‌లో లాలూ ప్రసాద్ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించిలాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు సునీల్ సింగ్‌తో సహా ఆర్జేడీ నేతలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది.
తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్ తరపు లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు. రిమాండుకు పంపాలన్నవాదనలను తోసిపుచ్చింది. రాజాసింగ్ అరెస్టు, బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 3 గంటలపాటు వాదనలు జరిగాయి.
సీఎం వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరి 10.35 గంటలకు చీమకుర్తి చేరుకుంటారు. 10:55కు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి,
బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి స్వర్గస్తులయ్యారు . మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండగా ఈటల రాజేందర్ రెండో కుమారుడు.
బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంవిద్యార్థి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్‌కు ధర్మాసనం రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అనంతరం రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.