Home / బ్రేకింగ్ న్యూస్
గుజరాత్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో నిలచున్నారు.
లైగర్ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు విచారించారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా హీరో అయిన విజయ్ దేవరకొండను కూడా విచరణకు పిలిపించారు.
నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాట ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ప్రగతిభవన్ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న షర్మిల కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్‌తో నేడు ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెడుతోన్న మంకీపాక్స్‌కు కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మంకీపాక్స్ అనే పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’గా మార్చింది.
వివాహం అన్నాక విందు కామన్. కొంతమంది అయితే పెళ్లిళ్లలో విందులో వడ్డించే ఐటమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. అయితే వివాహ విషయంలో ఒక్కోదగ్గర ఒక్కో సంప్రదాయం ఉంటుంది. కాగా తాజాగా ఓ పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. జియో యూజర్లు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దానితో ప్రస్తుతం ట్విట్టర్లో #Jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. "ప్లాట్‌ఫామ్" పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.
ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు రుతురాజ్ గైక్వాడ్. విజయ్ హజారే ట్రోఫీలో రెండో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్‌పై గైక్వాడ్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
తెలంగాణలోని మరో రెండు చారిత్రక కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి.