Last Updated:

Maruti Ciaz: మారుతి కీలక నిర్ణయం.. ఏప్రిల్ నుంచి ఈ కార్లు కనపడవ్..!

Maruti Ciaz: మారుతి కీలక నిర్ణయం.. ఏప్రిల్ నుంచి ఈ కార్లు కనపడవ్..!

Maruti Ciaz: మారుతి సుజుకి దేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సిద్ధమవుతోంది. విక్రయాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. సియాజ్ ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయనుంది. అయితే దీని ఉత్పత్తి మార్చి 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది చివరిగా 2018లో అప్‌డేడ్ చేశారు.

మారుతి సియాజ్ 2014 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదలైంది. మారుతి సియాజ్ అమ్మకాలలో నిరంతరం తగ్గుముఖ పడుతున్నాయి. నెలవారీ ప్రాతిపదికన మాట్లాడినట్లయితే.. అక్టోబర్ 2024లో మారుతి సియాజ్ మొత్తం 659 మంది కొత్త కస్టమర్‌లు కొన్నారు. నవంబర్, 2024లో మొత్తం 597 మంది మారుతి సియాజ్‌ని కొనుగోలు చేశారు. అంతేకాకుండా.. డిసెంబర్ 2024లో మారుతి సియాజ్ 464 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, 2025 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో కూడా మారుతి సుజుకి సియాజ్ 768 మంది కస్టమర్లను మాత్రమే పొందింది. మొత్తం మీద ప్రతినెలా 1000 మంది కస్టమర్లు కూడా రావడం లేదు.

2020లో కంపెనీ తన డీజిల్ వేరియంట్‌ను నిలిపివేసినప్పుడు సియాజ్ విక్రయాలు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీని తరువాత, సియాజ్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఆ సమయంలో మారుతి సుజుకి సియాజ్ విక్రయాలలో 30శాతం డీజిల్ వేరియంట్‌లు ఉన్నాయి. దేశంలోని సెడాన్ సెగ్మెంట్‌లోని ఇతర కార్లలో అడాస్ టెక్నాలజీ, సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్బో పెట్రోల్ ఇంజన్‌లను ప్రవేశపెట్టారు. ఈ కారణంగా ఇది సంస్థ బలహీనమైన లింక్‌గా మారింది.

మారుతి సియాజ్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. కారు ఇంజన్ గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్, 138ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మారుతి సుజుకి సియాజ్ తన పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌పై వినియోగదారులకు 20.65 కిమీ/లీ మైలేజీని ఇస్తుందని, ఆటోమేటిక్ వేరియంట్‌పై లీటరుకు 20.04 కిమీ మైలేజీని ఇస్తుందని పేర్కొంది. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, భద్రత కోసం, డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.