Maruti Wagon R: మిడిల్ క్లాస్ కలల కారు.. పెట్రోల్ డబ్బులు ఆదా.. ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో వ్యాగన్ ఆర్..!

Maruti Wagon R: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇప్పుడు తన కొత్త తరం వ్యాగన్ ఆర్‌పై పనిచేస్తోంది. ఈ వాహనం త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ( ఇథనాల్)తో నడిచే కొత్త వ్యాగన్ ఆర్‌ని మారుతి ఆవిష్కరించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి కంపెనీ హైబ్రిడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో తదుపరి తరం వ్యాగన్ ఆర్‌ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
వ్యాగన్ కంపెనీకి చెందిన మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కారు ఢిల్లీలోని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ఇథనాల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో కూడా ప్రదర్శించారు. ఇది ముడి చమురు దిగుమతులను తగ్గించి, పచ్చని వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ఏదైనా 20శాతం (E20) , 85శాతం (E85) ఇథనాల్-పెట్రోల్ ఇంధనంపై రన్ అవుతుంది.
ఫ్లెక్స్ ఇంధనంతో పాటు, కంపెనీ ఈ కారును హైబ్రిడ్ వెర్షన్‌లో కూడా తీసుకురానుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. కొత్త వ్యాగన్ ఆర్‌లో కొత్త ఇంజన్ ఇవ్వవచ్చు. దీనితో పాటు హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఇందులోకి తీసుకురావచ్చు. సుజుకి దీనిని హైబ్రిడ్ టెక్నాలజీతో జపాన్‌లో పరిచయం చేయనుంది. ఇందులో 0.66 లీటర్ సామర్థ్యం గల హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. దీనితో eCVT ట్రాన్స్‌మిషన్ అందించారు. ఇది కాకుండా, కొత్త వ్యాగన్ ఆర్ డిజైన్ కూడా అప్‌డేట్ అవుతుంది. దీని కారణంగా, వ్యాగన్ ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు.
కొత్త వ్యాగన్ ఆర్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఇంకా సమాచారం రాలేదు, అయితే ఈ ఏడాది మార్చి తర్వాత కంపెనీ ఈ వాహనాన్ని విడుదల చేయగలదని నమ్ముతారు. అంతేకాకుండా ఈ సంవత్సరం మారుతి సుజుకి తన మొదటి EVని లాంచ్ చేస్తుంది, ఆ తర్వాత ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. రాబోయే కాలంలో కంపెనీ బయోగ్యాస్ కార్లపై కూడా దృష్టి సారిస్తుంది.