Kia EV4: డిజైన్ అద్భుతంగా ఉంది గురూ.. కియా ఈవీ4 వచ్చేస్తోంది.. ఛార్జింగ్ టెన్షనే లేదు..!

Kia EV4: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా మోటర్స్ చాలా దేశాల్లో తన కార్లను విక్రయిస్తుంది. ఇండియాలో కూడా ఇప్పుడు కియా చాలా ఫేమస్. ఇక్కడ అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే కియా మారుతి సుజికి, టాటా మోటర్స్ వంటి కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. కియా ఫ్యూయల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తూ తన సత్తా చాటుతుంది. ఇప్పటికే దేశంలో పలు ఈవీ మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా కొత్త ఈవీ కారును ఆవిష్కరించింది. ఈవీ 4 పేరుతో ఈ కారును విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త కియా కారు మార్కెట్ వాటాను పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కియా ఈవీ4 హ్యాచ్‌బ్యాక్, సెడాన్ రెండు వెర్షన్స్‌లో వస్తుంది. కియా ఈ కారును మొదటగా తన సొంత దేశంలో విడుదల చేస్తుంది. ఆ తరువాత గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్లో లాంచ్ అవుతుంది. అయితే ICE వేరియంట్‌లో అమ్మకానికి ఉంటుందో లేదో అనే దాని గురించి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు.
ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, కియా ఈవీ4 రెండు బ్యాటరీ ప్యాక్ లభించే అవకాశం ఉంది. అందులో అందులో మొదటిది 58.3 కిలోవాట్, రెండోది 81.4 కిలోవాట్. ఇక ఈ కారు రేంజ్ విషయానికి వస్తే చిన్న బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌పై 430 కిమీ పరిధిని అందిస్తుంది. అదే పెద్ద బ్యాటరీ విషయానికి వస్తే ఏకంగా 630 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇదే సరైన మోడల్.
ఇటీవల కాలంలో ప్రజలు టూర్స్ లేదా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి, ఈవీ4తో ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ లేకుండా హాయిగా లాంగ్ డ్రైవ్‌ను ఎంజాయ్ చేయచ్చు. ఈ కారులో ఇచ్చిన బ్యాటరీలను ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ అందించారు. ఈ టెక్నాలజీ ద్వారా 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 31 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది.
కియా ఈవీ4లో అధునాతన ఫీచర్స్‌ను అందించారు. క్యాబిన్ థీమ్ చాలా ఆకట్టుకుంటుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్ అద్బుతుంగా ఉంటుంది. కారు ముందు భాగంలో నిలువుగా ఉన్నటువంటి హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ ఎల్ఈడీలు, స్పోర్టీ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్,ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, టేపరింగ్ రూఫ్‌లైన్, ప్రయాణికుల రక్షణ కోసం అడాస్ ఫీచర్, ఐ-పెడల్ 3.0 రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇంకా అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
కియా కంపెనీ ఈ కారును మార్చి 4న కొరియాలో లాంచ్ చేయనుంది. ఆ తరువాత యూరోపియ్ మార్కెట్లోకి వస్తుంది. అయితే అమెరికాలో ఈవీ4 సెడాన్‌ను మాత్రమే విడుదల చేస్తున్నారు. భారత్‌లో విడుదలపై కియా మోటార్స్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. దీనిపై కంపెనీ నుంచి త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తుంది.