BMW Z4 M40i Pure Impulse: బీఎమ్‌డబ్ల్యూ నుంచి కొత్త కార్.. ధర వింటే గుండె గుభేల్.. అక్షరాలా ఎన్ని కోట్లంటే?

BMW Z4 M40i Pure Impulse Launched: బీఎమ్‌డబ్ల్యూ ఇండియా తన ఐకానిక్ స్పోర్ట్స్ కారు Z4 – Z4 M40i ప్యూర్ ఇంపల్స్ ఎడిషన్ కొత్త లిమిటెడ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఎడిషన్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర ఆటోమేటిక్ వెర్షన్‌కు దాదాపు రూ.1 కోటిగా ఉంచారు. అయితే మాన్యువల్ వెర్షన్ ధర దీని కంటే రూ. 1 లక్ష ఎక్కువ. ఈ స్పెషల్ ఎడిషన్‌ను భారతదేశానికి దిగుమతి చేసుకున్నారు.
BMW Z4 M40i Pure Impulse Engine
Z4 M40i ప్యూర్ ఇంపల్స్ ఎడిషన్ 3.0-లీటర్, 6-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 335 బిహెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ వెర్షన్ 4.6 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఆటోమేటిక్ వెర్షన్ 4.5 సెకన్లలో వేగాన్ని చేరుకుంటుంది. ఇందులో అడాప్టివ్ ఎమ్ స్పోర్ట్ సస్పెన్షన్, ఎమ్ స్పోర్ట్ బ్రేక్‌లు, ఆటో స్టార్ట్-స్టాప్‌తో డిఫరెన్షియల్, ఎకో ప్రో మోడ్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి పనితీరు,ఇంధన సామర్థ్యం మధ్య అద్భుతమైన సమతుల్యతను అందిస్తాయి.
BMW Z4 M40i Pure Impulse Design
ఈ లిమిటెడ ఎడిషన్‌లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. ఇందులో రెండు కొత్త మెటాలిక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి – ఫ్రోజెన్ డీప్ గ్రీన్, సాన్రెమో గ్రీన్. దీనితో పాటు, పనితీరు, రూపాన్ని మెరుగుపరచడానికి, ముందు భాగంలో 19-అంగుళాల స్పోర్టీ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 20-అంగుళాలు అందించారు.
BMW Z4 M40i Pure Impulse Front Look
ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్‌టీరియర్ లుక్ మునుపటి కంటే మరింత దూకుడుగా,స్టైలిష్‌గా ఉంది. ఇది హరిజెంటల్ మెష్ నమూనాతో కూడిన కొత్త కిడ్నీ గ్రిల్, వర్టికల్ LED హెడ్‌లైట్లు, L-ఆకారపు టెయిల్‌లైట్లు, స్పోర్టీ రియర్ డిఫ్యూజర్, స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఇది దాని శక్తివంతమైన రూపాన్ని మరింత పెంచుతుంది.
BMW Z4 M40i Pure Impulse Interior
Z4 M40i ప్యూర్ ఇంపల్స్ ఎడిషన్ క్యాబిన్ కూడా చాలా ప్రీమియం, స్టైలిష్‌గా ఉంది. ఇది వెర్నాస్కా కాగ్నాక్ లెదర్ సీట్లు, ప్రత్యేకమైన స్టిచింగ్, ఎమ్ స్పోర్ట్ సీట్లు, లెదర్-వ్రాప్డ్ ఎమ్ స్టీరింగ్ వీల్, హై-గ్లోస్ బ్లాక్ ట్రిమ్‌లతో వస్తుంది.
BMW Z4 M40i Pure Impulse Features
ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఉంది. ఇది బీఎమ్‌డబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 పై నడుస్తుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, 3D నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, త్రూ-లోడింగ్ సిస్టమ్, డోర్ బిన్‌లు, సీట్ల వెనుక స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
BMW Z4 M40i Pure Impulse Safety
సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి,
ఇవి ప్రతి డ్రైవ్‌ను సురక్షితంగా, నమ్మదగినవిగా చేస్తాయి.
ఇవి కూడా చదవండి:
- India’s Unsafe Car: ప్రమాదంలో ప్రయాణం.. ఈ కార్లు కొంటే మీ ప్రాణాలు గాల్లోనే.. ఈ మోడళ్ల జోలికి పోకండి..!