Home /Author Narasimharao Chaluvadi
దేశంలో 3వ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధామి మోదీ ప్రారంభించారు. గాంధీనగర్-ముంబయి మద్య నడిచే ఈ రైలును ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మోదీ పచ్చ జెండా ఊపి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం నిర్మాణంతో ఎవ్వరికీ నష్టం రాదని కేంద్రం స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా సునీల్ బన్సల్ గత ఆగస్ట్ లో నియామకమైనారు. ఈ నేపధ్యంలో ఆయన అక్టోబర్ 1న హైదరాబాదుకు రానున్నారు.
ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశం మాటలపై తెలంగాణ మంత్రి హరీష్ రావుకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు మా ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చని విస్మయానికి గురిచేశారు
ఏపీ ప్రభుత్వ తీరు పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, ఉపాద్యాయుల పై కర్కశంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కేసులు పెడుతూ, జైల్లో వేస్తున్నారని మంత్రి హరీష్ మాట్లాడారు
వ్యవసాయ విద్యుత్ మీటర్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేసారు. వచ్చే మార్చి నాటికి వంద శాతం వ్యవసాయ మోటారు పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు
ఏపీ ప్రభుత్వంకు హైకోర్టులో స్టేలు, మొట్టికాయలు కామన్ అయిపోయాయి. తాజాగా ఓ కేసు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో అమల్లోను 6వారాల పాటు నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
ప్రముఖ నటుడు, భాజాపా మాజీ కేంద్ర మంత్రి దివంగత కృష్ణంరాజు గుర్తుగా మొగల్తూరు తీరప్రాంతంలో ఆయన పేరుతో రెండు ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు రోజా, వేణు, నాగేశ్వర రావులు తెలిపారు
దసరా శరన్నవ రాత్రుల పర్వదినాల పవిత్రతను భక్తుల దరిచేర్చేందులో ఏపీ దేవదాయ శాఖ వెనుకబడి పోయింది. పలు కీలక ఆలయాల్లో సాంప్రదాయ పద్దతులకు తిలోదకాలు వదలడంతో భక్తులు ఇక్కట్లు పాలౌతున్నారు
ప్రముఖ గిన్నీస్ వరల్ట్ రికార్డుల గాయకుడు గజల్ శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. సంగీత స్వరమాధురి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం గజల్ శ్రీనివాస్ కు లభించింది. లతా మంగేష్కర్ జన్మ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్ ఈ పురస్కారాన్ని అందుకొన్నారు.