Last Updated:

Vande Bharat Express: సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో 3వ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధామి మోదీ ప్రారంభించారు. గాంధీనగర్-ముంబయి మద్య నడిచే ఈ రైలును ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మోదీ పచ్చ జెండా ఊపి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Vande Bharat Express: సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Gujarat: దేశంలో 3వ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధామి మోదీ ప్రారంభించారు. గాంధీనగర్-ముంబయి మద్య నడిచే ఈ రైలును ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మోదీ పచ్చ జెండా ఊపి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైలులో కొంతదూరం ప్రయాణించిన ప్రధాని అందులోని వసతులను పరిశీలించారు.

కాల్పుర్ రైల్వే స్టేషన్ కు వరకు ప్రయాణించిన మోదీతో పాటు రైల్వే సిబ్బంది కుటుంబాలు, మహిళా వ్యాపారవేత్తలు, యువత కూడా రైల్లో ప్రయాణించారు. వారితో ముచ్చటించిన అనంతరం వారంతా ప్రధానితో ఫోటోలు తీసుకొన్నారు. అక్టోబర్ 1నుండి గాంధీనగర్-ముంబయి మద్య హైస్పీడ్ రైలు సేవలు ప్రయాణీకులకు అందుబాటులో రానున్నాయి. రైలు టికెట్టు ధరలు రూ. 1385 నుండి రూ. 2505 తరగతుల వారీగా ఉండనున్నాయి. వందే భారత్ తరహా రైల్లు ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, శ్రీమాతా వైఫ్ణోదేవి మార్గాల్లో నడుస్తున్నాయి.

రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిన్నటిదినం సూరత్, భావ్ నగర్ లో పర్యటించారు. నేడు అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజక్టు ఫేస్-1ను కూడా మోదీ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: పోలవరం వల్ల భద్రాచలంకు ముప్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రం

ఇవి కూడా చదవండి: