Home /Author Narasimharao Chaluvadi
ఓ వైపు ఆర్ధిక భారం. మరో వైపు ఉన్న పధకాల్లో లొసుగులు. నెల పుడితే కొత్త అప్పులకు ఎదురుచూపులు. అయినా ఏపీ ప్రభేత్వం తగ్గేదేలేదంటూ మరో రెండు సంక్షేమ పధకాలకు శ్రీకారం చుట్టింది
వైకాపా తరపున 2024లో విజయవాడ పార్లమెంటు స్థానం నుండి నటుడు అక్కినేని నాగార్జున పోటీ చేస్తారంటూ వస్తున్న ప్రచారాలకు తెరపడింది. ఏ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పేర్కొన్నారు
గుజరాత్ లో రూ. 25కోట్ల 80 లక్షల రూపాయల నకిలీ రెండు వేల రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిని ఓ అంబులెన్సు మాటున తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాయి.
ఏపీ ప్రభుత్వ పనితీరు నానాటికి దిగజారిపోతుంది. నిత్యం ఎక్కడో ఓ చోట విధ్వంశాలు, కొట్లాటలు, మాటల తూటాలు, అసభ్యకరమైన స్ననివేశాలు. తాజాగా ఓ మంత్రి సమక్షంలోనే నాటు సారా గుప్పుమనింది. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసు యంత్రాంగం, చోధ్యానికే పరిమితమైన ఆ ఘటన డోన్ లో చోటుచేసుకొనింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు. వారి వారి ఆలోచనల మేరకు పాలన ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే మేం కూడా పరుషంగా మాట్లాడగలం. సీఎం కేసిఆర్ ను తిడితే మంత్రి హరీష్ కు సంతోషం అనుకొంటే అందుకు మేము రెడీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో పేర్కొన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది. పార్టీకి, అనుబంధ సంస్ధలకు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు జారీ చేసిన్నట్లు సమాచారం.
ఒకే రాజధాని, అది కూడా నాటి అధికార, ప్రతిపక్షాలు ఆమోదించిన అమరావతినే రాజధానిగా ఉంచడం. ఇదే అమరావతి రాజధాని రైతులు రెండవ దఫా చేపట్టిన పాదయాత్ర ఆధ్యంతం నినాదాలతో సాగుతున్న డిమాండ్ పోరు యాత్ర. అమరావతి నుండి అరసవళ్లి వరకు చేపట్టిన రైతుల మహా పాద యాత్ర 19వ రోజుకు చేరుకొనింది.
నేడు సినిమాలు, ప్రత్యేక ఫోలలో అశ్లీలతే ప్రధాన అంశంగా మారిపోయింది. దీనిపై సమాజ సేవకులు అనేక సందర్భాలలో అశ్లీలతను విడనాడాలని పేర్కొనివున్నారు. తాజాగా బిగ్ బాస్ షో అశ్లీలత పై ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
గుంటూరు జిల్లా తెనాలిలో భాజాపా ప్రజాపోరు యాత్ర వాహనానికి గుర్తు తెలియన దుండగులు నిప్పు పెట్టారు. ఈ నెల 21 నుండి తెనాలిలో ప్రజా పోరు యాత్రను భాజాపా చేపట్టింది
ఏపీలో అధికార పార్టీ నేతల తీరుతో ఆలయాలు కూడా అపవిత్రంగా మారిపోతున్నాయి. భగవంతుని దర్శనాన్ని సైతం భక్తితో కాకుండా అహంభావం మాటున దర్శించుకొంటూ వైకాపా ఎమ్మెల్యే వెల్లంపల్లి వార్తల్లోకి ఎక్కారు.