Home /Author Narasimharao Chaluvadi
ఛత్తీస్గఢ్లో మావోలు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఏపీలో పేరుకే మూడు రాజధానులని, పాలనంతా విశాఖ నుండే సాగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదురావు అన్నారు. సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) 103వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత కామ్రెడ్ కె. శ్రీనివాసుల చేతులమీదుగా ఏఐటియుసి పతాకవిష్కరణ చేశారు.
అక్టోబర్ మాస చివర రోజున షేర్ ట్రేడింగ్ మదుపరుల్లో సంతోషాన్ని నింపింది. బిఎస్ఈ సెన్సెక్స్ 786.74 పాయింట్లు లాభపడి 60,746-59 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225.40 పాయింట్లు లాభపడి 18,012-20 వద్ద ముగిసింది.
2023లో అసెంబ్లీ, 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తెరాస పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
ఉప ఎన్నికకు తరలిస్తూ రూ. 89.91లక్షల నగదు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులకు పట్టుబడింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడి డ్రైవర్ తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
డేటా సెంటర్ వ్యాపారంలో భాగంగా యోట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉత్తరప్రదేశ్లో రూ.39వేల కోట్లు పెట్టుబడి పెట్టనుందని కంపెనీ కో ఫౌండర్, హిరానందానీ గ్రూపు చైర్మన్ దర్శన్ హిరానందాని పేర్కొన్నారు.
భాజపా నేతలు దిక్కుమాలిన, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా అద్యక్షులు బండి సంజయ్ వి నకిలీ, మకిలీ మాటలని హరీష్ రావు విమర్శించారు. అబద్ధాలు చెప్పడం భాజపా డిఎన్ఏగా మరిందని ఆయన వ్యాఖ్యానించారు.
తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. పదవ తరగతి పరీక్షా పత్రాల లీక్ కేసులో బెయిల్ పై మంత్రి నారాయణ ఉన్నారు. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జనసేన పార్టీ అధికారంలోకి రాగానే తొలి దృష్టి ఏపీలో సంచలనం సృష్టించిన 10 తరగతి విద్యార్ధిని సుగాలి ప్రీతిబాయ్ అనుమానస్పద మృతి కేసుపైనే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.