Home /Author Narasimharao Chaluvadi
ఇటీవల ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ సాధించిన విజయంతో ఆ పార్టీ ముందస్తు ఎన్నికల నినాదాన్ని భుజాలపై ఎత్తుకొనింది. దీని కోసం లాంగ్ మార్చ్ ను నేడు ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. లాహోర్ నుండి ఇస్లామాబాద్ కు సాగే 380కి.మీ లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్స్ఈ, ఎన్ఎస్ఈ లు లాభాలతో ముగిశాయి. వారం చివరి రోజున ఇన్వెస్టర్ల నుండి మద్దతు లభించడంతో సెన్సెక్స్ సూచీలు లాభాలు అందుకొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 203.01 పాయింట్లు లాభపడి 59,959.85 వద్ద ముగిసింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ల భేటీ ఖరారైంది. నవంబర్ లో ఇండోనేషియాలోని బాలి వేదికగా జరగనున్న జీ-20 లీడర్షిప్ సమ్మిట్లో ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపిన్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వార తెలియచేసింది.
సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తులను ఎందుకు పట్టుకోవడం లేదని తెదేపా నేత బొండా ఉమ సీఎం జగన్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
తెలంగాణా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో బేరాసారాల జరిగిన ఆడియో క్లిప్పులను తెరాస పార్టీ విడుదుల చేసింది.
సొంతజిల్లా అభివృద్ధిని గాల్లోకివదిలేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లావాసులకు క్షమాపణ చెప్పాలని భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి డిమాండ్ చేశారు.
తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో అత్యవసరణ విచారణ చేపట్టాలని తెలంగాణ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
దేశంలోని ప్రస్తుతం శాంతి భద్రతలు, సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసుల పాత్ర ప్రధాన భూమికగా పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లోని పోలీసులందరికి ఒకే దేశం-ఒకే యూనిఫాం గుర్తింపును తీసుకోరావాల్సిన అవశ్యం ఏర్పడిందని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం సురక్షితమైంది, ఏ ఏ దేశాల్లో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయో తెలుపుతూ గ్లోబల్ అనలిటిక్స్ సంస్ధ గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ ను విడుదల చేసింది. జాబితాలో 96 పాయింట్లు సాధిస్తూ సింగపూర్ తొలి స్థానంలో నిలబడింది. భారత దేశం 80 పాయింట్ల సాధించి 60వ ర్యాంకులో నిలిచింది.
విజిలెన్స్ అధికారుల తీరును నిరసిస్తూ తిరుమల క్షురకులు నిరసనలకు దిగారు. దీంతో ప్రధాన కల్యాణ కట్టతో పాటు పలు ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించేందకు భక్తులు బారులు తీరారు.