Home /Author Jyothi Gummadidala
ఏపీలో జనసేన మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు పవన్. ఇకపోతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. కాగా ఈ యంగ్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. అయితే ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మూవీమేకర్స్ వెల్లడించారు.
ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే ట్విట్టర్ కు పోటీగా మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించి పని పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త సామాజిక మాధ్యమ వేదికకు ‘బ్లూస్కై’గా నామకరణం చేసినట్టు సమాచారం.
మునుగోడు బైపోల్స్ లో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ భాజపాపై విరుచుకుపడ్డారు. ప్రజలకు ఓటుపై అవగాహణ కల్పించారు. మీకు చేతులెత్తి మొక్కుతున్న ఒక్కసారి సోచాయించండంటూ ఆయన తెలిపారు.
దక్షిణభారత ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ ఓ వైపు కొరియోగ్రఫీ, మరోవైపు దర్శకుడిగా ఇంకోవైపు హీరోగా చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కాంచన-3 చిత్రం తర్వాత మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకుని రుద్రుడు సినిమాతో లారెన్స్ మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీ పని చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్. మరి అవేంటో ఓ సారి చూసెయ్యండి.
పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తన జీవితంలోని సంచలన విషయాలను తెలిపాడు. గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నానని ఓ దశలో కొకైన్ కు బానిసనని వెల్లడించాడు.
తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాష్ట్రంలో ఇకపై ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది.
ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు తెలంగాణలోని వరంగల్ లో ఉండే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
భారత బ్యాటింగ్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. అయితే చిరకాల ప్రత్యర్థి, దాయాదీ దేశం అయిన పాకిస్థాన్‌లోనూ విరాట్‌కు వీరాభిమానులున్నారండోయ్. పాక్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు.