Home /Author anantharao b
ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా! ఇండియాకు చెందిన ఓ వ్యాపారి తన లగ్జరీ కారు రేంజి రోవర్‌ను కేరళ నుంచి దుబాయికి తీసుకువెళ్లి ప్రపంచంలోనే అత్యంతఎత్తైన ఆకాశహర్మ్యం బుర్జ్ ఖలీఫా ముందు పార్క్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం చాలా మంది యూ ట్యూబ్ చానల్స్ పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో అర్మాన్ మాలిక్ ఒకరు. ఆయన లైప్ స్టయిల్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ఆయన ఇటీవల సిద్దార్ధ కన్నన్ షోలో ప్రత్యక్షమయ్యారు.
అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతీయ జనతాపార్టీ సీతమ్మకు దేవాలయం కట్టి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం లోకసభ ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. ఐదవ విడత ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్‌లో పర్యటిస్తున్నారు.
ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిల్చిపోయిన సంక్షేమ పథకాల నిధులు తాజగా విడుదలయ్యాయి. ఆసరా పథకానికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి.
ఏపీలో ఇసుక మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్‌నగర్..పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఒక వైపు ఎన్నికలు మరో వైపు ఎండలు రాజకీయ నాయకులను ఉక్కరిబిక్కిర చేస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. శనివారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్సియస్ నమోదు అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఈ - మెయిల్ రావడంతో పెద్ద కలకలం ఏర్పడింది. విమానంలోని లావెట్రీలో ఓ టిష్యూ పేపరుపై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న పేపర్ లభించింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన మూడు రోజులకు ముఖ్యమంత్రి జగన్ బయటకి వచ్చి మాట్లాడారు . గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషణ చేసి అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని అన్నారు.