Home /Author anantharao b
ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా పటిష్టతపై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డిని కాదని, సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ఆందోళనలకు సంబంధించి సమాచారం అందితే ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులకు సమాచారం ఇస్తుంటారు.
ఆప్ అంటే "అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ" అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత అజోయ్కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకటన రాజకీయాలు, అవినీతికి పాల్పడుతున్న ఆప్ని అరవింద్ అడ్వర్టైజ్మెంట్ పార్టీ, అరవింద్ యాక్టర్స్ పార్టీ, అరవింద్ ఐష్ పార్టీ అని పిలవాలని అన్నారు.
బెంగళూరులోని ఐటీ కంపెనీలను ఉద్దేశించి కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక సంచలన వ్యాఖ్యలు చేసారు. 30కి పైగా ఐటీ కంపెనీలు మురికినీటి కాలువలను ఆక్రమించుకున్నాయని అన్నారు. ధనికులైనా పేదవారైనా ఏదైనా ఆక్రమణలను కూల్చివేయాలని మేము మా అధికారులను కోరాము.
చాలా మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ తర్వాత కూడ జాతీయ స్థాయి పరీక్లో విజయం సాధించడం కష్టంగా ఉంటోంది. హర్యానాకు చెందిన తనిష్క ఇంజనీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షలను ఒకే సంవత్సరంలో సాధించగలిగింది.
తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది.
ఈ రోజుల్లో, చాలా మంది జంటలు కాంట్రాక్టు మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తమ పెళ్లికి ముందు ఒప్పందం పై సంతకాలు చేస్తున్నారు. వ్యక్తులను బట్టి, వారి అవసరాలను బట్టి ఇవి ఉంటాయి. అయితే తమిళనాడులో మాత్రం కాబోయే భార్యభర్తలు ఇద్దరు చేసుకున్న ఒప్పదం ఆసక్తిని రేపింది.
అక్టోబర్ 5 న దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది.
పశ్చిమబెంగాల్ లో బీజేపీ నవన్న ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించకముందే ప్రతిపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, రాహుల్ సిన్హాలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో పోలీసులతో సువేందు వాగ్వాదానికి దిగారు
కోహినూర్ వజ్రం జగన్నాథ స్వామిదేనని ఒడిశాకు చెందినసామాజిక, సాంస్కృతిక సంస్థ శ్రీ జగన్నాథ్ సేన పేర్కొంది. యునైటెడ్ కింగ్డమ్ నుండి చారిత్రాత్మకమైన పూరీ ఆలయానికి తిరిగి రావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని కోరింది.