Home /Author anantharao b
నమామి గంగే ప్రాజెక్ట్ కోసం వనరులు సేకరించే ప్రయత్నంలో భాగంగా రాజకీయ నాయకులు మరియు ప్రముఖ వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసిన బహుమతులు వేలానికి రాబోతున్నాయి. ఈ-వేలం సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రారంభం కానుంది.
సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో తనపై బూట్లు విసరడంతో రాజస్థాన్ క్రీడా మంత్రి అశోక్ చంద్నా కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాపై షూ విసిరి సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అయితే, అతన్ని త్వరగా చేయాలి. ఎందుకంటే ఈ రోజు నాకు పోరాడాలని అనిపించడం లేదు.
బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ తాను తన శాఖలో 'దొంగలకు సర్దార్' నంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీహార్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ రైతులను ఆదుకుంటామనే పేరుతో దాదాపు రూ.200 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) మాజీ మంత్రుల ఇళ్లపై ఈరోజు విజిలెన్స్ దాడులు నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డివిఎసి) అధికారులు ఎఐఎడిఎంకె నాయకుడు ఎస్ పి వేలుమణికి చెందిన 26 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
అహ్మదాబాద్‌లోని ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అతడిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన విక్రమ్ అనే ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌ని తన ఇంట్లో డిన్నర్ చేయమని అభ్యర్థించాడు.
ఏపీ సీఎం జగన్ నాడు-నేడు, విద్యాకానుక, బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ ల పంపిణీ, తరగతిగదులు డిజిటలైజేషన్ పై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్దులకు అందించే బ్యాగులు నాణ్యంగా, మన్నిక ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.
కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేపీకి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లేదు. టీడీపీతో తెగతెంపులు చేసుకుని 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఒక్క శాతం ఓట్లు కూడా సాధించలేక, పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిజాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది
మునుగోడులో కాంగ్రెస్ శ్రేణుల మద్దతుకోసం ఆమె ముప్ప తిప్పలు పడుతున్నారంట రాజగోపాల్ రాజీనామాలో బైపోల్స్ అనివార్యమైన మునుగోడు సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.