Home /Author anantharao b
కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రం ట్రైలర్ రిలీజయింది. యాక్షన్, రొమాన్స్ కలగలిపి మాస్ మసాలా దట్టించి ఉన్న ఈ ట్రయిలర్ సంక్రాంతి పండక్కి అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు. నాగార్జున మాస్ పాత్రలో ఈజీగా నటించారు.
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌ను నియమించారు. సోమవారం రాజీనామా చేసిన ఎలిసబెత్ బోర్న్ తర్వాత, ఆధునిక చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ప్రధానమంత్రిగా అతను రికార్డుకెక్కారు. అంతేకాదు అట్టల్ ఫ్రాన్స్‌లో మొట్టమొదటి గే ప్రధాన మంత్రి.
దక్షిణ కొరియా పార్లమెంటు కుక్క మాంసం పరిశ్రమను నిషేధించే చట్టాన్ని మంగళవారం ఆమోదించింది. జాతీయ అసెంబ్లీ 208-0 ఓట్ల తేడాతో ఈ బిల్లును ఆమోదించింది. ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ ప్రభుత్వం నిషేధానికి మద్దతు ఇస్తోంది.దీనితో చట్టం చేయడానికి తదుపరి చర్యలు లాంఛనప్రాయంగా పరిగణించబడతాయి.
ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, మిసా భారతి, హిమా యాదవ్, హృద్యానంద చౌదరి, అమిత్ కత్యాల్ పేర్లు ఉన్నాయి. ఛార్జిషీట్లో రెండు సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నారు.
బెంగళూరులో ఏఐ స్టార్టప్‌కు సీఈవోగా ఉన్న ఒక మహిళ, తన భర్తను కలవకుండా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిందని సోమవారం అరెస్టు చేశారు. గోవా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా చిత్రదుర్గలో కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో పోలీసులు పట్టుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ చర్యలకి ఉపక్రమించింది.మేడిగడ్డ రిజర్వాయర్‌పై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకి సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జలసౌధ ఇరిగేషన్ కార్యాలయంలోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు.
ఐదు గ్యారంటీల కోసం అప్లై చేసిన అభయహస్తం దరఖాస్తు పత్రాలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. బాలానగర్ ఫ్లైఓవర్‌పై బైక్‌పై నుంచి ఫామ్స్ చిందరవందరగా పడిపోయాయి. ఎవరో ర్యాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానని సదరు బైకర్ తెలిపాడు. సుమారుగా 500 వరకు ఉన్న ఈ దరఖాస్తులు హయత్ నగర్ పరిధిలోనివి అని గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం తీసుకెళ్తున్నట్లు సమాచారం.
ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంపై.. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. పార్టీకి సంబంధించిన సానుభూతి ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల నమోదుపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల స్వీకరించడానికి.. ప్రతి పార్టీకి సమయం ఇస్తామని ఈసీ తెలిపింది.
తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసే మీడియా తాటతీస్తానంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు హెచ్చరించారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ కు హాజరయిన రాజు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ తనను టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.