Home / వ్యవసాయం
సహజ వనరులైన సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పర్యావరణాన్ని సంరక్షిస్తూ, నాణ్యమైన, అధిక దిగుబడులను పొందవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అదెలానో.. మరి ఆ సేంద్రీయ ఎరువులేంటో ఓ లుక్కెయ్యండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తికానుంది. కాగా పోలవరం ద్వారా తొలి విడతగా 2.98 లక్షల ఎకరాలకు నీరందనుంది.
పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ జన్యుపరంగా బలమైన కొత్త గోధుమ విత్తనాన్ని (PBW 826) ప్రవేశపెట్టింది, ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర రకాలతో పోలిస్తే మెరుగైన వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రైతులు మునుపటి రబీ సీజన్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడం వల్ల పంట నష్టాలను చవిచూశారు.
బీహార్‌లోని మిథిలమఖానా కేంద్ర ప్రభుత్వంచే భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్‌ని అందుకుంది. దీనిని ఫాక్స్ నట్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిని సాధారణంగా పెంకుతో కొట్టి, ఎండబెట్టి, ఆపై మార్కెట్లో విక్రయిస్తారు.
అగ్రి బిజినెస్ కంపెనీ గోద్రెజ్ అగ్రోవెట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ కింద అస్సాం మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలతో మూడు అవగాహన ఒప్పందాలు (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండ్) కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్, జార్ఖండ్ మరియు గ్లోబల్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కంపెనీ, సెటిల్మింట్, సంయుక్తంగా రైతులకు బ్లాక్‌చెయిన్ ఆధారిత విత్తన పంపిణీని విజయవంతంగా ప్రారంభించినట్లు ప్రకటించాయి.
వరి పంట కోత మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, పంజాబ్ ప్రభుత్వం వరిగడ్డిని కాల్చడాన్ని నియంత్రించడానికి సిద్ధమయింది.పంట అవశేషాల నిర్వహణ (CRM) పథకం కింద ప్రభుత్వం అందించే స్టబుల్ మేనేజ్మెంట్ మెషీన్లు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే 1 లక్షకు పైగా దరఖాస్తులను స్వీకరించింది.
క్షీరశ్రీ పోర్టల్‌ను కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని పాడి రైతులకు ప్రోత్సాహకాల పంపిణీకి క్షీరశ్రీ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. కేరళలోని పాల ఉత్పత్తిదారులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఈ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడింది
వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ వర్షాధార ప్రాంత అథారిటీ (NRAA) వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, జీవనోపాధిని సురక్షితంగా మరియు పోషకాహారాన్ని మెరుగుపరచడానికి సమగ్ర విధానాన్ని తీసుకోవడం ద్వారా వర్షాధార వ్యవసాయ వృద్ధిని వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని ప్రతిపాదించింది.
వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) 2022-2023 ఖరీఫ్ పంట సీజన్ కు సంబంధించి బాస్మతి పంట సర్వేను ప్రారంభించింది. కోవిడ్-19 పరిమితుల కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బాస్మతి పంట సర్వే జరుగుతోంది.