Home / వ్యవసాయం
అనంతపురం జిల్లా రైతులు వినూత్న ఆలోచనా పద్ధతులతో అరటి సాగు చేస్తున్నారు. జిల్లాలో వీచే ఈదురు గాలుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు అరటి చెట్లకు బెల్ట్ సిస్టం ఏర్పాటు చేసి అరటిని పండిస్తున్నారు.
కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతులు సశ్యరక్షణ చర్యలు తీసుకుంటూ మునగసాగులో దూసుకుపోతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనంత రైతులు మరి ఈ మునగసాగు మెలకువలు ఏంటో ఆ రైతు మాటల్లోనే విందాం.
ఉద్యానవన పంటలతో రైతులు లాభాలు పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో చామంతి సాగుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన కిసాన్ అగ్రిషోలో పలువురు రైతులు వ్యవసాయ ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. పుచ్చకు సంబంధించి పలు రకాల వెరైటీల సీడ్స్ ప్రదర్శించారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక రైతు ఉల్లి పంట ధర పతనమవడంతో సాగుదారుల దుస్థితిని హైలైట్ చేయడానికి మరియు ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఉల్లి పంటను తగలబెట్టాడు.
అనంతపురం జిల్లాకు చెందిన మల్లిఖార్జునరెడ్డి అనే రైతు వినూత్న వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ తక్కువ ఖర్చుతో లాభాలను పొందుతున్నారు. బత్తాయి సాగును చేస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఆ విశేషాలేంటో ఈ వీడియో ద్వారా చూసేయ్యండి.
Agriculture News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఉల్లిపాయలు కేవలం వంట రుచి కోసమే కాదు.. కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మార్కెట్లో ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
Tandur: పప్పుల్లో చాలా రకాలు ఉంటాయి.. కానీ అందులో ఈ పప్పు వేరు.. కాదు కాదు ఇక్కడ పండించిన కందిపప్పే ప్రత్యేకం. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే మన తాండూర్ వెళ్లాల్సిందే. ఇక్కడ పండించే కందిపప్పు చాలా ప్రత్యేకం.. ఈ పప్పుకు నాణ్యతలో మరేది సాటి రాదు.. అలాగే రుచి కూడా వేరు. అందుకే ఇక్కడ పండించే కందిపప్పుకు డిమాండ్ ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఈ కంది పప్పుకు మంచి డిమాండ్ ఉంది. అందుకే […]
కష్టించి పండించిన పంటకు మద్ధతు ధర రాకపోతే ఆ రైతన్న ఆవేదన వర్ణనాతీతం. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా ఆయనకు అన్ని ఖర్చులు పోయి చివరకు చేతికి అందింది కేవలం రూ. 8.36 పైసలు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఓ రసీదు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాట ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. రెండంకెల్లో ఉన్న ధర ఇప్పుడు రెండు రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.