Last Updated:

Jio 84 Days Plan: డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. 84 రోజుల వాలిడిటీతో జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లు!

Jio 84 Days Plan: డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. 84 రోజుల వాలిడిటీతో జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లు!

Jio 84 Days Plan: మీరు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లు అయితే మీకో అదరిపోయే శుభవార్త ఉంది. ఎక్కువ రోజులు వాలిడిటీ అందించే రెండు రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్‌ల మధ్య దాదాపు రూ.90 వ్యత్యాసం ఉంది. కాల్స్, డేటా, ఎస్‌ఎమ్ఎస్ ప్రయోజనాలను ఒకే విధంగా అందిస్తాయి. అలానే 84 రోజుల వాలిడిటీని అందిస్తాయి. రండి ఈ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

రిలయన్స్ జియో రూ.799 ప్లాన్
జియో రూ. 799 ప్లాన్‌లో వినియోగదారులు 84 రోజుల వాలిడిటీతో రోజుకు 100 ఎస్ఎమ్ఎస్, 1.5GB డేటా ప్రయోజనాలను అందిస్తాయి. ప్లాన్‌లో మొత్తం 126GB డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, హై స్పీడ్ డేటా లభిస్తుంది. అలానే డేటా లిమిట్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కెబిపిఎస్‌కి తగ్గుతుంది. ఇది కాకుండా ఈ ప్లాన్‌తో వినియోగదారులు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అనేక జియో యాప్‌ల యాక్సెస్ కూడా పొందుతారు.

జియో రూ.889 ప్లాన్
జియో రూ. 889 ప్లాన్ జియో వినియోగదారులకు 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో కూడా ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో ియో సావన్ ప్రో ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. అలనే జియో టీవీ, జియో క్లౌడ్, కూడా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

రెండిటిలో ఏది బెస్ట్ తెలుసా?
జియో రూ. 799, రూ. 889 ప్లాన్‌ల మధ్య ఒకే ఒక తేడా ఉంది. అది జియో సావ్న్ ప్రో సబ్‌స్క్రిప్షన్. మీరు సంగీత ప్రియులైతే, యాడ్ ఫ్రీ సంగీతాన్ని వినాలనుకుంటే రూ. 889 ప్లాన్ మీకు ఉత్తమమైనది. మరోవైపు మీరు జియో సావ్న్ ప్రో సబ్‌స్క్రిప్షన్ తీసుకోకూడదనుకుంటే రూ. 799 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ.799తో రీఛార్జ్ చేసుకుంటే రూ.90 ఆదా అవుతుంది. రెండు ప్లాన్‌లలో మీరు రోజుకు 1.5GB డేటా, ఉచిత కాల్‌లు, 100 ఎస్ఎమ్‌ఎస్‌ల ప్రయోజనాన్ని పొందుతారు.