Last Updated:

Vivo Y300 Plus 5G: వివో సందడి.. బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త ఫోన్.. ఇక మార్కెట్‌లో మంటలే!

Vivo Y300 Plus 5G: వివో సందడి.. బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త ఫోన్.. ఇక మార్కెట్‌లో మంటలే!

Vivo Y300 Plus 5G: టెక్ ప్రపంచంలో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. కంపెనీలు సరికొత్త ఫీచర్లతో పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వివో కొత్త ఫోన్ విడుదల చేసింది. మిండ్ రేంజ్ సెగ్మెంట్‌లో ‘Vivo Y300 Plus 5G’ స్మార్ట్‌ఫోన్‌ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

స్మార్ట్‌ఫోన్‌లో కర్వ్ డిస్‌ప్లేతో అట్రాక్ట్ డిజైన్, వెనుక ప్యానెల్ కార్నర్‌లో రెక్టాంగిల్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. ఈ వివో ఫోన్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం శక్తివంతమైన 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు 5000mAh కూడా ఫోన్‌లో అందించారు. మీరు మిడ్-రేంజ్ అంటే రూ. 25,000 సెగ్మెంట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

Vivo Y300 Plus 5G Price
128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ వివో స్మార్ట్‌ఫోన్ 8GB RAM వేరియంట్‌ను రూ.23,999కి విడుదల చేసింది. అదనంగా వినియోగదారులు ICICI, SBI, HDFC క్రెడిట్/డెబిట్ కార్డ్‌లతో రూ. 1,000 తక్షణ తగ్గింపును కూడా పొందచ్చు. దీని తర్వాత మీరు వివో ఇండియా ఈ స్టోర్ ద్వారా సిల్క్ బ్లాక్, సిల్క్ గ్రీన్ కలర్స్‌లో ఫోన్‌ను రూ. 22,999కి కొనచ్చు. ఈ ఫోన్‌ను మూడు, ఆరు నెలల్లో నో-కాస్ట్ EMIతో ఆర్డర్ చేయచ్చు.

Vivo Y300 Plus 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 1300 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌ ఉంటుంది. అలానే 8GB LPDDR4X RAM, UFS 2.2 128GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫన్‌టచ్ ఓఎస్ 14తో ఫోన్ రన్ అవుతుంది.

కెమెరా విషయానికి వస్తే వివో వై300 ప్లస్ 50MP ప్రైమరీ షూటర్, 2MP డెప్త్ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32MP సెన్సార్‌ని చూస్తారు. ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉన్నాయి.