Chandrababu Met Modi: ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయి అరగంటపాటు చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం మద్దతును కోరారు
Chandrababu Met Modi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయి అరగంటపాటు చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం మద్దతును కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎన్గీఏ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈరోజు చంద్రబాబు హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ,ఆరోగ్య మంత్రి జెపి నడ్డాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్బంగా కేంద్రం ఇచ్చిన హామీలు, ఆర్దక సాయం తదితర అంశాలపై చంద్రబాబు కేంద్రమంత్రులతో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
అన్ని అంశాలపైన చర్చ.. (Chandrababu Met Modi)
బుధవారం ఢిల్లీకి బయలుదేరే ముందు, అన్ని సమస్యలపై ప్రధాని మోదీతో చర్చిస్తానని చంద్రబాబు చెప్పారు.అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం అమరావతి మాత్రమే కాదు, అన్ని అంశాలపైనా చర్చిస్తామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్డీయేలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి.. వారికి వివరించి కేంద్రం సాయం తీసుకుంటాం.. రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాలని ఆయన అన్నారు.175 అసెంబ్లీ స్థానాల్లో 164 సీట్లు ప్రజలు ఎన్డీయేకు ఇచ్చారని, కూటమి ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలను గెలుచుకున్న టీడీపీ, బీజేపీ తర్వాత ఎన్డీయేలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.