TGS RTC: టీజీఎస్ ఆర్టీసీగా మారిన టీఎస్ ఆర్టీసీ
టీఎస్ ఆర్టీసీ.. టీజీఎస్ ఆర్టీసీగా మార్చింది. ఈ మేరకు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశించింది.
TGS RTC: టీఎస్ ఆర్టీసీ.. టీజీఎస్ ఆర్టీసీగా మార్చింది. ఈ మేరకు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశించింది.
కొత్త లోగో విడుదల చేయలేదు..(TGS RTC)
ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మార్పులు చేయగా.. తాజాగా ఆర్టీసీ సైతం టీజీఎస్ ఆర్టీసీగా మార్పులు చేసింది. సంస్థ ఎండీ సజ్జనార్ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చడం జరిగిందని.. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలు మార్చినట్లు పేర్కొన్నారు. విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మరోవైపు టీసీఎస్ఆర్టీసీ లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదన్నారు.