Last Updated:

Wardhannapet Govt Hospital: వర్ధన్నపేట ఆసుపత్రిలో దారుణం ..గర్భిణీకి నర్సులు డెలివరీ.. శిశువు మృతి

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి నర్సులు ఆపరేషన్ చేయడంతో పుట్టిన బిడ్డ అస్వస్దతకు గురై మరణించింది. దీనితో బాధితులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలివి.

Wardhannapet Govt Hospital: వర్ధన్నపేట ఆసుపత్రిలో దారుణం ..గర్భిణీకి నర్సులు డెలివరీ.. శిశువు మృతి

 Wardhannapet Govt Hospital:వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి నర్సులు ఆపరేషన్ చేయడంతో పుట్టిన బిడ్డ అస్వస్దతకు గురై మరణించింది. దీనితో బాధితులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలివి.

డెలివరీ చేసిన నర్సులు..( Wardhannapet Govt Hospital)

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన కసిరెడ్డి శ్రీజకు ఈ నెల 16న పురిటినొప్పులు వచ్చాయి. దీనితో ఆమెను డెలివరీ కోసం వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరునాడు పురిటినొప్పులు ఎక్కువకావడంతో కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనితో కంగారు పడి నర్సుల వద్దకు పరుగులు తీశారు. విషయాన్ని వారికి చెప్పడంతో వారు శ్రీజను శ్రీజను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. అనంతరం డాక్టర్ సెల్ ఫోన్లో లో సూచనలు ఇస్తుంటే వింటూ ఆపరేషన్ పూర్తి చేశారు. డెలివరీలో శ్రీజకు మగ శిశువు పుట్టి కొంత అస్వస్థతకు గురి కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మరణించడం జరిగింది. దీనితో శ్రీజ భర్త డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ వర్దన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: