Union Minister Jaishankar: పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగమే.. కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. పీఓకే భారత్‌లో భాగమే అని మరోమారు నొక్కి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ భారత్‌లో అంతర్బాగమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ హింసాత్మక ఘటనలకు దారితీయడానికి ప్రధాన కారణం పెరిగిపోతున్న ద్రవ్యోల్బణమే అని అన్నారు.
Union Minister Jaishankar:పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. పీఓకే భారత్‌లో భాగమే అని మరోమారు నొక్కి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ భారత్‌లో అంతర్బాగమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ హింసాత్మక ఘటనలకు దారితీయడానికి ప్రధాన కారణం పెరిగిపోతున్న ద్రవ్యోల్బణమే అని అన్నారు. అక్కడి ప్రజలు ఇండియాలోని జమ్ము కశ్మీర్‌తో పోల్చుకొని తమ బతులకు ఎలా ఉన్నాయి.. అక్కడి అంటే ఇండియాలో ఉండే జమ్ము కశ్మీర్ ప్రజలు బతుకులు ఎలా ఉన్నాయో పోల్చి చూసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్నారు విదేశాంగమంత్రి.
పీవోకేపై సోషల్ మీడియాలో వార్తలు..(Union Minister Jaishankar)
అక్కడ జరుగుతున్న సంఘటనలు గురించి సోషల్ మీడియాతో పాటు టెలివిజన్లలో వార్తలను చూస్తున్నామన్నారు. ఇక్కడ భారత్‌లోని జమ్ము కశ్మీర్ ప్రజలు అభివృద్ది పథంలో దూసుకుపోతుంటే పాకిస్తాన్లో ఉన్న తాము మాత్రం నిత్యావసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అయితే పీఓకే ఇండియాలో ఎప్పడు విలీనం అవుతుందని ఆయనను ప్రశ్నించగా.. పీఓకె భారత్‌లో అంతర్భాగమేనని ఆయన స్పష్టం చేశారు. విలీనం అయ్యేంది ఏముంది.. భారత్‌లో అంతర్భాగమేనని ఆయన అన్నారు. ఇండియా తమ అదుపులో ఎప్పుడు తీసుకుంటుందనేగా మీరు ప్రశ్నించేది.. తాను కూడా త్వరలోనే ఇండియాలో విలీనం చేసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నానని అన్నారు.
మన దేశంలో ఆర్టికల్ 370 కొనసాగుతోంది. ప్రస్తుతానికి పీఓకే గురించి ఎలాంటి చర్చ జరగలేదు. 1990లో పాశ్చాత్యదేశాలు ఇండియాపై ఒత్తిడి పెంచిన మాట వాస్తవమే.. అప్పుడు పార్లమెంటు దీనిపై ఒక తీర్మానం చేశారు. ప్రస్తుతం పీఓకేలో గత శుక్రవారం నుంచి ప్రజలు పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. విద్యుత్ చార్జీలు అమాంతం పెంచడంతోప్రజలు రోడ్డెక్కారు. గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మంగళవారం నాడు జరిగిన అల్లర్లలో కనీసం ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. పాకిస్తాన్ భద్రతా దళాలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరగడంతో పలువురు మృతి చెందారు.