Student Died in Swimming Pool: స్విమ్మింగ్పూల్లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది . ఓ స్కూల్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సుజాత స్కూల్ లో ఈ ఘటన జరిగింది .
Student Died in swimming pool: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది . ఓ స్కూల్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సుజాత స్కూల్ లో ఈ ఘటన జరిగింది . స్కూల్ లో సమ్మర్ క్యాంప్ పేరుతో స్విమ్మింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామానికి చెందిన గాండ్ల శివశౌర్య (7) స్కూల్ లో స్విమ్మింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. శిక్షణలో భాగంగా శుక్రవారం స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
పీఈటీలకు దేహశుద్ది..(Student Died in swimming pool)
విద్యార్థి మృతి విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ పీఈటీలకు దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.