Last Updated:

Brij Bhushan Singh: బ్రిజ్‌భూషణ్‌ నేరాల చిట్టా.. ఎస్పీకే తుపాకీ గురిపెట్టిన ఘనుడు

Brij Bhushan Singh: బ్రిజ్‌భూషణ్‌ సింగ్.. ఇపుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. భారత స్టార్ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తుంది ఈయనపైనే. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ ఉన్నారు.

Brij Bhushan Singh: బ్రిజ్‌భూషణ్‌ నేరాల చిట్టా.. ఎస్పీకే తుపాకీ గురిపెట్టిన ఘనుడు

Brij Bhushan Singh: బ్రిజ్‌భూషణ్‌ సింగ్.. ఇపుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. భారత స్టార్ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తుంది ఈయనపైనే. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు పెట్టడానికి కూడా పోలీసులు ఆలోచిస్తున్నారంటే అతడు ఎలాంటివాడో అర్ధం అవుతుంది. పోలీసులు ముందుకు రాకపోవడంతో.. స్వయంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది.
మరి బ్రిజ్ భూషణ్ చేసిన నేరాలేంటో తెలుసా?

ఎస్పీకే తుపాకీ గురిపెట్టి.. (Brij Bhushan Singh)

బ్రిజ్‌భూషణ్‌ సింగ్.. ఇపుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. భారత స్టార్ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తుంది ఈయనపైనే. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు పెట్టడానికి కూడా పోలీసులు ఆలోచిస్తున్నారంటే అతడు ఎలాంటివాడో అర్ధం అవుతుంది. పోలీసులు ముందుకు రాకపోవడంతో.. స్వయంగా సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది.
మరి బ్రిజ్ భూషణ్ చేసిన నేరాలేంటో తెలుసా?

ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ కు పెద్ద నేరాల చిట్టా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అండర్ వరల్డ్ డాన్.. దాపూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఓ సారి ఏకంగా జిల్లా ఎస్పీకే తుపాకీ గురిపెట్టి బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో పాటు.. బాబ్రీ ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకొంటూ పెద్ద వివాదాల చిట్టా ఉంది. యూపీలో నేర సామ్రాజ్యాన్ని ఏలుతున్న బాహుబలి నేతల్లో ఈయన ఒకరిని అక్కడివారు చెప్పుకుంటారు.

బ్రిజ్ భూషణ్ సింగ్ ఏకంగా ఎంపీగా ఆరుసార్లు పార్లమెంట్‌ లో అడుగుపెట్టారు. ఇతడిపై పదుల సంఖ్యలో కేసులున్నా రాజ్యంగ పదవులను అనుభవిస్తున్నాడు. భారీ ఎత్తున విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించాడు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాలో బ్రిజ్‌భూషణ్‌ హవా కనపడుతుంది.

రాజకీయ ప్రస్థానం..

బ్రిజ్‌భూషణ్‌ 1957లో బిష్ణోపూర్ లో జన్మించారు. అయోధ్యకు సమీపంలో సాకేత్‌ డిగ్రీ కళాశాలలో చదువుతున్నపుడు విద్యార్ధి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత చిన్న చిన్న ప్రభుత్వ కాంట్రాక్టులతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ సింగ్ కి వ్యతిరేకంగా పని చేయడం మెుదలు పెట్టాడు. ఓ నామినేషన్ విషయంలో.. జిల్లా ఎస్పీకే నేరుగా తుపాకీ తలకి పెట్టి బెదిరించాడు. తుపాకీతో బెదిరించిన విషయాన్ని ఆయన గొప్పగా చెప్పుకుంటారు.

దావూద్‌తో సంబంధాలు..

బ్రిజ్ భూషణ్ సింగ్ కి దావుద్ తో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ తన రికార్డుల్లో పేర్కొంది. దీంతో పాటు.. బాబ్రీ మసీదు కూల్చివేతలో కూడా ఈయన పాత్ర ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. దావుద్ తో సంబంధాలు కలిగి ఉన్నాడనే కారణంతో.. 1996లో టాడా చట్టం కింద జైలుకి వెళ్లాడు. ఆ సమయంలో.. ఇతడికి భాజపా నేత వాజ్‌పేయీ లేఖ రాశారు. ధైర్యం కోల్పోవద్దని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. బ్రిజ్ భూషణ్ జైల్లో ఉన్న సమయంలో.. అతడి భార్య ఎన్నికల్లో గెలిచింది.

సొంతపార్టీ ఎంపీ అభ్యర్థిని..

1999లో బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ గోండా నుంచి ఎంపీగా విజయం సాధించాడు. కానీ 2004 ఎన్నికల్లో ఎన్నికలకు బ్రిజ్‌భూషణ్‌ను స్థానాన్ని బల్ రాంపూర్ కి మార్చింది. ఇది బ్రిజ్ భూషన్ కి అస్సలు నచ్చలేదు. అదే 2004 ఎన్నికల్లో గోండా అభ్యర్ధిత్వాన్ని ఘనశ్యామ్‌ శుక్లాకు ఇచ్చారు. ఆ సమయంలో శుక్లా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల సమయంలో.. శుక్లా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కానీ ఇది బ్రిజ్ భూషణ్ చేయించిన ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం నేపథ్యంలో 2009 ఎస్పీ పార్టీలో చేరి ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత ఇదే స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించాడు.

 

రాజకీయాలు.. రెజ్లింగ్‌పై

రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూనే.. రెజ్లింగ్ సమాఖ్యపై పట్టుసాధించాడు. మెల్లిమెల్లిగా జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడితో పాటు.. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ డబ్ల్యూఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. మరో కుమారుడు ప్రతీక్‌.. గోండా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.